ETV Bharat / state

'అనుమతిస్తే సొంత నిధులతో పేదల ఆకలి తీరుస్తా' - ముఖ్యమంత్రి జగన్​కు తెదేపా నేత అరవింద్ బాబు లేఖ

ప్రభుత్వం అనుమతినిస్తే తన సొంత నిధులతో పేద ప్రజల ఆకలి తీరుస్తానని ముఖ్యమంత్రి జగన్​కు తెదేపా నేత అరవింద్ బాబు లేఖ రాశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ అమలులో ఉన్నందున పట్టణంలో ఉన్న అన్న క్యాంటీన్ల ద్వారా 1500 మందికి ఉచిత భోజనం పెడతానని ఆయన లేఖలో పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి జగన్​కు లేఖ రాసిన తెదేపా నేత అరవింద్ బాబు

author img

By

Published : Mar 31, 2020, 7:50 AM IST

మాట్లాడుతున్న తెదేపా నేత అరవింద్​ బాబు

ప్రభుత్వం అనుమతినిస్తే తన సొంత నిధులతో పేద ప్రజల ఆకలి తీరుస్తానని ముఖ్యమంత్రి జగన్​కు తెదేపా నేత అరవింద్ బాబు లేఖ రాశారు. గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలోని అన్న కాంటీన్లలో ఈ మేర పేదలకు అన్నదానం చేసే అవకాశం కల్పించాలని కోరారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ అమలులో ఉన్నందున హోటల్స్​ లేక నిరుపేదలు ఆకలితో పస్తులుంటున్నారని తెలిపారు. పట్టణంలో మూడు అన్నా క్యాంటీన్లు ఉన్నాయని సీఎం అనుమతిస్తే ప్రతిరోజు ఒక క్యాంటీన్​కి ఐదు వందల మంది చొప్పున మూడు క్యాంటీన్లలో 1500 మందికి ఉచిత భోజనం పెడతానని స్పష్టం చేశారు. రాజకీయాలు పక్కనపెట్టి పేదవాడి ఆకలి తీర్చడానికి ప్రభుత్వం, అధికారుల అనుమతి ఇవ్వాలని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: పారిశుద్ధ్య కార్మికులకు అండగా దాతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.