జ్యుడీషియల్ రివ్యూ పేరు చెప్పి ఇన్ని తప్పులా..? అంటూ తెదేపా నేత పట్టాభి ప్రశ్నించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తే వెయిటేజీకి 40 మార్కులా అంటూ మండిపడ్డారు. వెయిటేజీ మార్కులు పెంచడంలో కూడా కుట్ర అర్థమైందన్నారు. అరబిందో కంపెనీకి ప్రయోజనం చేకూర్చడానికి ఇన్ని కుట్రలు చేస్తారా అని ఆరోపించారు. జ్యుడీషియల్ రివ్యూ పేరుతో అబ్రాడ్ అనే పదం తీసుకొచ్చారని పట్టాభి పేర్కొన్నారు. కరోనా సమయంలో సరిపడా అంబులెన్స్‌లు ఎందుకు పెట్టలేదని పట్టాభి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరోనా రోగులను తరలించే అంబులెన్స్‌లోనే ఇతర రోగులను తరలిస్తున్నారని ఆరోపించారు. ఇతర రోగుల జీవితాలతో ఆడుకునే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: చాచి కొడితే చైనా మేజర్ ముక్కు పగిలింది