Nakka Anand Babu Fires on Jagan: పంచాయతీ రాజ్ ఈఎన్‌సీ నియామకం జగన్ రెడ్డి దళిత ద్రోహమేనని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్‌బాబు మండిపడ్డారు. ముఖ్యమంత్రి అయ్యింది మొదలు ఎస్సీ, ఎస్టీలను అవమానిస్తూ, జగన్ రెడ్ల సేవలో తరిస్తున్నారని విమర్శించారు. పంచాయతీరాజ్ ఈఎన్‌సీగా సుబ్బారెడ్డిని నియమించిన జగన్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని అన్నారు. సీనియారిటీలో ముందున్న బాలునాయక్ని కాదని, 5వస్థానంలో ఉన్న సీవీ సుబ్బారెడ్డిని ఈఎన్‌సీగా ఎలా నియమిస్తారని నిలదీశారు.
సీవీ సుబ్బారెడ్డి నియామకంపై పంచాయతీరాజ్ శాఖలోని దళితులు ముఖ్యమంత్రిని నిలదీయాలన్నారు. ప్రభుత్వంలో దళితులకు జరుగుతున్న అన్యాయంపై దళిత సంఘాలు పెదవి విప్పాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఓట్లకు తప్ప.. పదవులకు పనికిరారన్న దురాభిప్రాయం జగన్‌ది అని విమర్శించారు. బానిసత్వం, భయంతో బతికితే.. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని జగన్ లాంటి పాలకులు హరిస్తారని దళితులు గుర్తించాలన్నారు. దళిత, గిరిజనుల ఐక్యపోరాటం తాడేపల్లి ప్యాలెస్‌ను నేలమట్టం చేసే రోజు దగ్గర్లోనే ఉందని నక్కా ఆనంద్‌బాబు హెచ్చరించారు.
ఇవీ చదవండి: