PATTABHI FIRES ON CM JAGAN : జగన్ రెడ్డి రాష్ట్రంలోని సహకార డెయిరీల ఆస్తులు కబ్జా చేయడానికి సరికొత్తగా ‘అమూల్ బేబీ’ అవతారం ఎత్తారని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. పాడి పరిశ్రమను తన గుప్పెట్లో పెట్టుకోవాలన్న కుతంత్రంతోనే జగన్‌రెడ్డి అమూల్ జపం చేస్తున్నారని ఆరోపించారు. అడ్డగోలుగా చిత్తూరు డెయిరీ ఆస్తుల్ని నామమాత్ర ధరకు అమూల్‌కు కట్టబెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
2022లో కోటి రూపాయల లీజు.. మరో వందేళ్ల తర్వాత కూడా కోటి రూపాయలేనా అంటూ నిలదీశారు. ఎన్నికలకు ముందు లీటర్ పాలకు రూ.4 బోనస్ ఇస్తానని జగన్ రెడ్డి ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. కృష్ణామిల్క్ యూనియన్ ఏడాదికి 60 కోట్ల బోనస్ ఇస్తుంటే, సంగం డెయిరీ కొన్ని కోట్ల రూపాయల బోనస్‌ను పాడి రైతులకు చెల్లిస్తుంటే, అమూల్ పైసా ఇవ్వడం లేదని పట్టాభిరామ్ విమర్శించారు.
ఇవీ చదవండి: