TDP LEADER PATTABHI FIRES ON CM JAGAN : జగన్ తన సైకోయిజంలో భాగంగానే కావాలని మరీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల్లో రూ.241 కోట్ల అవినీతి అని విషప్రచారానికి తెరలేపాడని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు. ఆగస్టు 2021లో అంతా సక్రమంగా ఉందని కాలేజీ యాజమాన్యాలు లేఖలు రాస్తే, సీఐడీ డిసెంబర్లో కేసు ఎలా నమోదు చేసిందని ప్రశ్నించారు.
కొన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాల్ని బాగు చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై.. కడుపుమంట దేనికని ధ్వజమెత్తారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌పై సంవత్సరం క్రితం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీఐడీ, నేటికీ ఒక్క ఆరోపణ కూడా ఎందుకు రుజువు చేయలేకపోయిందని నిలదీశారు. తాము ఈడీ పేరు వినగానే ఫోన్లు పారేసుకునే రకం కాదని ఎద్దేవా చేశారు.
ఇవీ చదవండి: