గుంటూరు జిల్లా మాచవరం మండలం కొత్తపాలెం గ్రామంలో తెదేపా కార్యకర్తపై దాడి జరిగింది. దాడి చేసిన వారే కేసు నమోదు చేసేందుకు వెళుతుండడంతో విషయం తెలుసుకున్న బాధితుడు మాచవరం పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించాడు. పిడుగురాళ్ల సీఐ ఆంజనేయులుతో పాటు సిబ్బంది మాచవరం చేరుకుని దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వ్యక్తిని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి విచారణ జరిపి న్యాయం చేస్తామని సీఐ హామీ ఇవ్వడంతో బాధితుడి తరఫు వారు ఆందోళన విరమించారు.
ఇదీ చదవండి: నడిగడ్డలో వైకాపా నాయకుల మధ్య ఘర్షణ..