గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచి పురంశెట్టి అంకులు హత్య కేసు దాదాపు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. హత్య చేసిన కీలక నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిషేధిత పార్టీకి చెందిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించడంతో కీలక సమాచారం రాబట్టారు.
హత్యలో ఎవరి ప్రమేయం ఉందో స్పష్టత వచ్చింది. రూ.15 లక్షల రూపాయలకు కిరాయి హత్యకు ఒప్పందం చేసుకొని ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తెలుస్తోంది. నగదు ఇచ్చి హత్య చేయించెందెవరు? ఇంకా ఎవరి ప్రమేయం ఉందోనని పోలీసులు విచారణ చేస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.
ఇదీ చదవండి: