ETV Bharat / state

'ఇంకెన్నాళ్లీ తప్పుడు ప్రచారాలు' చంద్రబాబుకు బెయిల్ రావటంతో దిక్కుతోచని స్థితిలో వైసీపీ: అచ్చెన్నాయుడు - సీఎం జగన్​పై అచ్చెన్నాయుడు ఫైర్

TDP Kinjarapu Atchannaidu Fires on YCP: చంద్రబాబుకు బెయిల్ మంజూరు అవ్వడంతో.. వైసీపీ గ్యాంగ్​ ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితికి వచ్చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. గడపగడపకూ వెళ్లిన వైసీపీ నేతలకు ప్రజలు తరిమి తరిమి కొట్టారని అన్నారు. దెబ్బ మీద దెబ్బతో వైసీపీ దిక్కుతోచని స్థితిలో ఉందని విమర్శించారు.

TDP_Kinjarapu_Atchannaidu_Fires_on_YCP
TDP_Kinjarapu_Atchannaidu_Fires_on_YCP
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 23, 2023, 7:52 AM IST

TDP Kinjarapu Atchannaidu Fires on YCP: దెబ్బ మీద దెబ్బతో వైసీపీ దిక్కుతోచని స్థితిలో ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంతో వైసీపీ (YCP) భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. రోజూ స్వచ్ఛందంగా లక్షలాది మంది భవిష్యత్ గ్యారెంటీ (Bhavishyathuku Guarantee) రిజిష్ట్రేషన్స్ చేసుకుంటున్నారని వెల్లడించారు.

చంద్రబాబు (Chandrababu)కు బెయిల్ మంజూరుపై అసహనంలో జగన్ రెడ్డి, వైసీపీ గ్యాంగ్ ఏం మాట్లాడుతున్నారో తెలియని స్థితికి.. ఆ బ్యాచ్ మొత్తం చేరిందని విమర్శించారు. గడపగడపకూ వెళ్లిన వైసీపీ నేతలకు ప్రజలు తరిమి తరిమి కొట్టారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ చేపట్టిన భవిష్యత్తుకు గ్యారెంటీకి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని తెలిపారు.

నా ఎస్సీ, ఎస్టీలు అంటూనే వాళ్లపై జగన్ దాడులు చేస్తున్నారు: అచ్చెన్నాయుడు

పిచ్చి పట్టినట్లు వ్యవహరిస్తోన్న జగన్ ముఠా: వరుస దెబ్బలతో అసహనంతో జగన్ ముఠా పిచ్చి పట్టినట్లు వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. భవిష్యత్తులో అందించే పథకాల గురించి చెబుతుంటే వైసీపీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఎందుకంత అసహనమని ప్రశ్నించారు. ఆడబిడ్డకు నెలకు 1500 రూపాయలు ఇస్తామంటే ఎందుకంత కోపమని అచ్చెన్న నిలదీశారు. చదువుకునే ప్రతి బిడ్డకూ 15 వేల రూపాయలు ఇస్తాం అని తాము చెప్తుంటే.. వైసీపీ నేతలు ఎందుకంత అసహనానికి గురి అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాము ఏటా మూడు సిలిండర్లు ఇస్తామని హామీ ఇస్తే.. మీకు ఎందుకు కడుపు మంట అని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ భృతి హామీతో వైసీపీ నేతల్లో నిరుత్సాహం కనిపిస్తోందని అన్నారు. అన్నదాతకు 20 వేల రూపాయలు ఇస్తామని ప్రకటిస్తే.. ఎందుకంత అక్కస అని ఆక్షేపించారు. బీసీలకు రక్షణ చట్టం తెస్తామంటే బరితెగింపు మాటలేల అని ప్రశ్నించారు. ఇంకెన్నాళ్లు ఇలా తప్పుడు ప్రచారాలతో కాలం నెట్టుకొస్తారని మండిపడ్డారు.

జగన్ మోహన్ రెడ్డిలా ప్రజల వ్యక్తిగత డేటా టీడీపీ సేకరించడం లేదని పేర్కొన్నారు. వాలంటీర్లతో వివాహేతర సంబంధాల గురించి ఆరా తీసింది ఎవరని నిలదీశారు. వాలంటీర్ల ద్వారా సేకరించిన సమాచారం అంతా రామ్ ఇన్ఫోటెక్ కంపెనీకి దోచిపెట్టంది ఎవరని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల తర్వాత వైసీపీని బంగాళాఖాతంలో కలిపేయడం తథ్యమని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

నిషేదమని చెప్పి, నాసిరకం మద్యాన్ని తెచ్చారు! చనిపోయిన 34 వేల మంది కుటుంబాలకు జగన్ ఇప్పుడు ఏం సంజాయిషి చెబుతారు!

Atchannaidu about Police Attack on Software Employee: అనంతపురంలో సాఫ్ట్​వేర్ ఉద్యోగి చంద్రశేఖర్ రెడ్డిపై సెబ్ పోలీసుల దాడిని.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. అక్రమ మద్యం సరఫరా చేసే వారిని వదలి.. అమాయకులపై ప్రతాపం చూపటం ఏంటని ప్రశ్నించారు. ముద్దాయి ఎవరో తెలియకుండా పోలీసులు దాడి చేసి గాయపరచడం సెబ్ పోలీసుల పని తీరుకు అద్దం పడుతోందని విమర్శించారు. గాయపడిన బాధితుడికి ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఘటనకు బాధ్యులైన సెబ్ పోలీసులుపై, అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

TDP State President Atchannaidu Angry On CM Jagan: ఏపీ నీడ్స్ కాదు.. ఏపీ హేట్స్ జగన్.. వైసీపీ పాలన అంతం.. ప్రజల పంతం : అచ్చెన్నాయుడు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.