ETV Bharat / state

TDP Janasena Working Committee First Joint Meeting: టీడీపీ, జనసేన సంయుక్త కార్యాచరణ కమిటీ తొలిభేటీ.. రాజమహేంద్రవరం వేదికగా.. - tdp janasena 2024 election Planning

TDP Janasena Working Committee First Joint Meeting: ఈనెల 23వ తేదీన టీడీపీ, జనసేన సంయుక్త కార్యచరణ కమిటీ తొలిసారి భేటీ కానుంది. ఈ భేటికి చంద్రబాబును అరెస్టు చేసిన రాజమహేంద్రవరమే వేదిక కానుంది. పవన్​, లోకేశ్​ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. రాజకీయ కార్యక్రమాల వేగం పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయించారు.

TDP_Janasena_Working_Committee_First_Joint _Meeting

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 21, 2023, 10:06 AM IST

TDP Janasena Working Committee First Joint Meeting: టీడీపీ, జనసేన సంయుక్త కార్యాచరణ కమిటీ తొలిభేటీ.. రాజమహేంద్రవరం వేదికగా..

TDP Janasena Working Committee First Joint Meeting: పొత్తు బంధాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు తెలుగుదేశం, జనసేన పార్టీలు కీలక అడుగులు వేస్తున్నాయి. ఇరుపార్టీలు సమన్వయ కమిటీ తొలి సమావేశాన్ని ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం 2గంటలకు రాజమండ్రి వేదికగా నిర్వహించాలని నిర్ణయించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ అధ్యక్షతన జరిగే.. సమన్వయ కమిటీ తొలి సమావేశంలో ఇరు పార్టీలు కలిసి చేపట్టాల్సిన ఉమ్మడి కార్యక్రమాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం, ఇరు పార్టీల సమన్వయంపై ప్రధానంగా ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

తెలుగుదేశం జనసేన పార్టీల సంయుక్త సమన్వయ కమిటీ తొలి సమావేశానికి ముహూర్తం ఖరారు అయ్యింది. విజయదశమి నాడు వైసీపీ ప్రభుత్వంపై రాజకీయ యుద్ధం మొదలు పెట్టే దిశగా.. ఇరు పార్టీలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నాయి. రాష్ట్రంలో 2024 ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చి, రాజకీయాల్ని కీలక మలుపు తిప్పే పరిణామాలకు తెలుగుదేశం అధినేత చంద్రబాబును నిర్బంధించి ఉంచిన రాజమహేంద్రవరమే వేదిక కానుంది.

TDP-JanaSena Coordination Committee: జనసేనతో సమన్వయం కోసం ఐదుగురు సభ్యులతో టీడీపీ కమిటీ ఏర్పాటు..

గత నెల 14వ తేదీన ఇరు పార్టీల మధ్య కూడా ఇక్కడే పొత్తు కుదిరింది. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆయన్ని కలిసి పరామర్శించిన జనసేనాని రాజమండ్రి కేంద్ర కారాగారం వెలుపల తమతో ఎవరొచ్చినా- రాకపోయినా, తెలుగుదేశం-జనసేనలు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీచేస్తాయని ప్రకటించారు. గత నెల రోజుల నుంచి ఐక్య పోరాటంపై ప్రాథమిక చర్చల దశలోనే ఉన్న రెండు పక్షాలు, ఇక రాజకీయ కార్యక్రమాల వేగం పెంచేలా ప్రణాళికలు సిద్దం చేసుకునేందుకు దసరా పర్వదినాన కలసి చర్చించనున్నాయి.

ఇప్పటికే తెలుగుదేశం- జనసేన పార్టీలు ఐదుగురు సభ్యులతో సమన్వయ కమిటీని నియమించాయి. ఇరుపార్టీలు కలసే పనిచేస్తాయని.. పార్టీల అగ్రనేతలు ప్రకటిస్తున్నప్పటికీ ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహించలేదు. ఐక్య పోరాటంపై ఇంతకాలం స్పష్టమైన ప్రకటన వెలువడకపోవడంతో కింది స్థాయి నాయకులు, కేడర్‌లో సందేహాలున్నాయి.

pawan kalyan: టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ.. సూచనప్రాయంగా వెల్లడించిన పవన్‌

ఈ నెల 23న రాజమహేంద్రవరం వేదికగా జరిగే తొలి సమావేశంలో ఆ సందిగ్ధతలన్నీ తొలగిపోతాయని ఇరు పార్టీల శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఉమ్మడి సమావేశంలో తీసుకునే నిర్ణయాలతో.. వచ్చే ఎన్నికల్లో తమకు తిరుగులేదన్న నమ్మకం ఇరుపక్షాల్లో వ్యక్తం అవుతోంది.

2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వ అరాచకాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై టీడీపీ, జనసేన మొదటి నుంచి వేర్వేరుగా పోరాడుతూ వచ్చాయి. వైసీపీ అరాచక పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించడమే రెండు పార్టీల ఉమ్మడి అజెండా కావడం, ఒకే లక్ష్యంతో పోరాడుతుండటంతో.. ఇరు పార్టీల మధ్య మళ్లీ సన్నిహిత వాతావరణం ఏర్పడింది.

Pawan Kalyan on Party Alliances: ఎన్డీఏతో పొత్తులోనే ఉన్నాం.. ఎన్నికలకు టీడీపీ-జనసేన-బీజేపీలు కలిసి వెళ్లాలని నా ఆకాంక్ష: పవన్‌

కలసి పనిచేస్తే మంచిదన్న ఆకాంక్ష రెండు పార్టీల్లోను వివిధ స్థాయిల్లో మొదలై, క్రమంగా అది బలపడింది. సెప్టెంబర్ 14వ తేదీన చంద్రబాబుతో జైల్లో ములాఖత్ అయిన పవన్‌ కల్యాణ్‌.. పొత్తులపై స్పష్టమైన ప్రకటన చేశారు. అప్పటి నుంచి ఇరుపార్టీల సమన్వయ కమిటీ తొలి సమావేశం ఎప్పుడెప్పుడా అని ఇరుపార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

రానున్న రోజుల్లో జరిగే ఉమ్మడి సమన్వయ కమిటీ సమావేశాలు రెండు పార్టీల్లోను.. కిందిస్థాయి కేడర్‌ కలసి పనిచేసే దిశగా మానసికంగా సిద్ధమయ్యేందుకు దోహదం చేస్తాయని నేతలు విశ్వసిస్తున్నారు. కార్యకర్తల మధ్య ఎక్కడైనా చిన్న చిన్న అంతరాలు ఉన్నా.. అవి సర్దుబాటు కావడానికి ఈ సమావేశాలు ఉపయోగపడతాయని టీడీపీ, జనసేన శ్రేణులు భావిస్తున్నాయి.

Pawan Kalyan Comments on YS Jagan: జనసేన-టీడీపీ కలిస్తే భయమెందుకు..? ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వస్తే చెప్తా: పవన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.