ETV Bharat / state

దళిత శ్మశానవాటిక ధ్వంసంపై తెదేపా నిజ నిర్ధారణ కమిటీ - tdp fact finding Committee latest news

దళితుల మనోభావాలను అగౌరవ పరిచేలా, అవమాన పరిచేలా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెదేపా నేతలు ఆరోపించారు. చిలకలూరిపేటలో దళిత శ్మశానవాటిక ధ్వంసంపై తెలుగుదేశం పార్టీ నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది.

tdp flag
tdp flag
author img

By

Published : Sep 25, 2020, 11:09 PM IST

Updated : Sep 29, 2020, 1:18 PM IST

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో దళిత శ్మశానవాటిక విధ్వంసంపై మాజీమంత్రి నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో సభ్యులుగా పిల్లి మాణిక్యాల రావు, మానుకొండ శివ ప్రసాద్, దేవతోటి నాగరాజులను నియమించారు.

దళితుల అనుమతి లేకుండా శ్మశానవాటికలో ఏ విధంగా పనులు మొదలుపెడతారని నేతలు ధ్వజమెత్తారు. దళితుల మనోభావాలను అగౌరవపరిచేలా, అవమానపరిచేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గడిచిన 16 నెలల్లో రోజుకో చోట దళితులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. విధ్వంసకర పాలనకు కేరాఫ్ అడ్రస్​గా ఆంధ్రప్రదేశ్​ను మార్చారని విమర్శించారు. దళిత వ్యతిరేక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని తెదేపా నేతలు ఓ ప్రకటనలో వ్యాఖ్యానించారు.

Last Updated : Sep 29, 2020, 1:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.