తెదేపా ప్రభుత్వ హయాంలో టిడ్కో ద్వారా 52 ఎకరాల్లో పీఎంఏవై పథకం ద్వారా నిర్మించిన 6,512 గృహాలను లబ్ధిదారులకు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ... గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో తెదేపా నేతలు ధర్నా చేపట్టారు.
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తైనా... లబ్ధిదారులకు కేటాయించిన టిడ్కో గృహాలను ఇంతవరకు అప్పగించకుండా నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. వెంటనే పేదలకు టిడ్కో ఇళ్లను అందజేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కమిషనర్ రవీంద్రకు వినతిపత్రం అందజేశారు.
ఇదీ చదవండి:
ఎస్సీ, ఎస్టీ, బీసీలను జగన్ ప్రభుత్వం మనుషుల్లా చూడటం లేదు: అచ్చెన్న