ఏడాది పాలనలో వైకాపా లక్ష కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు. రాష్ట్రంలో 55 లక్షల చిన్నారులు ఉంటే.. 35 లక్షల మంది పిల్లల తల్లిదండ్రుల ఖాతాల్లో మాత్రమే అమ్మ ఒడి నగదు జమ చేశారన్నారు.
ఎన్నికల ముందు స్వయం సహాయక బృందాలకు తీసుకున్న రుణం మొత్తం మాఫీ చేస్తామని చెప్పి .. పథకం పేరు పెట్టి గత ప్రభుత్వాల మాదిరిగానే కేవలం వడ్డీలే తిరిగి అందజేశారని అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో పార్టీ నేతలు భారీ స్థాయిలో కుంభకోణాలకు తెరతీశారని ఆరోపించారు.
ఇదీ చదవండి: