రాష్ట్రంలో ఇసుక కొరతపై.. గుంటూరులోని లాలపేటలో తెదేపా కార్యకర్తలు ఆందోళన చేశారు. తక్షణమే ఇసుక సరాఫరా చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. రోడ్డుపైనే అల్పహారం భుజిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇసుక అందుబాటులో లేక కార్మికుల జీవితాలు అతాలకుతలం అవుతున్నాయని తెదేపా నేత నసీర్ అహ్మద్ అన్నారు. వెంటనే చర్యలు తీసుకుని సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి..