విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా సాధనలో వైకాపా ప్రభుత్వం విఫమలమైందని... సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ(Ramakrishna) విమర్శించారు. రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్లైన సందర్భంగా... పార్టీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఆన్లైన్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో... సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి, తెదేపా జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్, ప్రత్యేక హోదా(Special Status) సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తానన్న జగన్ (Jagan)... ఎందుకు మౌనంగా ఉన్నారని నేతలు ప్రశ్నించారు. 3 రాజధానుల పేరుతో అమరావతిని అభివృద్ధి చేయకుండా నిరూపయోగంగా మార్చారని విమర్శించారు. తిరుపతి వెంకన్న సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేస్తామన్న ప్రధాని మోదీ (Modi)... మాట తప్పి ప్రజలను మోసగించారని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి(Thulasi reddy) విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి సొంత ప్రయోజనాల కోసం వైకాపా ప్రభుత్వం పనిచేస్తోందని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ఆరోపించారు. రాష్ట్రాన్ని 'రుణాంద్రప్రదేశ్'గా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీచదవండి.