గుంటూరు పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్, న్యాయవాది కాలే దేవదాసుతో కలిసి మంత్రి సీదిరి అప్పలరాజుపై అరండల్ పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎన్ 440కె రకం వచ్చిందని, అది ప్రమాదకరమైందని టీవీల్లో మాట్లాడిన విషయం ఫిర్యాదులో పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా రోగులకు కనీసం ఆక్సిజన్ సరఫరా చేయలేని ప్రభుత్వం.. విపక్ష నేతలపై కేసులు పెట్టడంలో బిజీగా ఉందని శ్రావణ్ కుమార్ ఆరోపించారు. ఏపీలో సరైన వైద్యం లేదని ప్రజలు తెలంగాణాకు వెళ్తుంటే.. సరిహద్దుల్లో అంబులెన్సులు ఆపేస్తున్నారని.. కనీసం ఆ సమస్య కూడా పరిష్కరించలేకపోయారని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: దేశంలో మరో 3.48లక్షల కరోనా కేసులు