గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం వినుకొండ టౌన్లో ఎన్టీఆర్, పరిటాల రవి విగ్రహాలు తొలగింపును వ్యతిరేకిస్తూ... తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు... విగ్రహల తొలగింపునకు నిరసనగా నల్ల జెండాలతో ర్యాలీ నిర్వహించారు.
నగరంలో అనుమతి లేని విగ్రహాలు చాలా ఉండగా... వాటిని కాదని ఎన్టీఆర్, పరిటాల విగ్రహాలు మాత్రమే తొలగించడాన్ని తప్పుబట్టారు. నగర కమిషనర్, అధికారుల సహాయంతో వైకాపా ఈ చర్యలకు దిగుతోందని జీవి ఆంజనేయులు ఆరోపించారు.
ఇదీ చదవండి: