TDP Atchannaidu on Chandrababu Public Meetings: జగన్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యంగా రేపటి నుంచి "రా కదలి రా!" పేరిట తెలుగుదేశం కార్యక్రమాలు చేపట్టింది. తెలుగుదేశం - జనసేన ఎన్నికల గుర్తులతో సరికొత్త లోగోను రూపొందించారు. సైకిల్ - గాజు గ్లాసుతో కూడిన లోగోను పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు.
పంచాయతీ సమస్యలపై రేపు సర్పంచ్‌లతో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. బీసీలకు జరిగిన అన్యాయంపై 4వ తేదీన జయహో బీసీ పేరిట రాష్ట్ర స్థాయి సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 5వ తేదీ నుంచి 29 వరకూ అన్ని పార్లమెంట్ స్థానాల్లో చంద్రబాబు బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు.
5న ఒంగోలు, 6న విజయవాడ, నరసాపురం పార్లమెంట్ పరిధిలో సభలు ఉండనున్నాయి. 18వ తేదీన ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో భారీ సభ నిర్వహించనున్నట్లు అచ్చెన్న వెల్లడించారు. పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఎన్టీఆర్ ఇచ్చిన రా కదలిరా పిలుపునే మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని తెలిపారు. విధ్వంసాలు, వైఫల్యాలు తప్ప జగన్ పాలనలో అభివృద్ధి అనేది భూతద్దంలో వెతికినా కనిపించదని విమర్శించారు.
రాష్ట్రానికి ఉన్న పేరు, ప్రతిష్టలను జగన్ నాశనం చేశారు: అచ్చెన్నాయుడు
రాష్ట్రాన్ని చీకటిమయం చేసి ఆంధ్రప్రదేశ్‌ని ఆందోళనప్రదేశ్గా జగన్మోహన్ రెడ్డి మార్చారంటూ అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. స్వర్ణయుగం తెలుగుదేశంతోనే సాధ్యమనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నామన్నారు. అన్ని సభలు తెలుగుదేశం - జనసేన సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతాయన్నారు. చంద్రబాబు- పవన్ కల్యాణ్ కలిసి పాల్గొనే సభలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.
పార్లమెంట్ స్థాయి బహిరంగ సభలతో సంబంధం లేకుండా మేనిఫెస్టో ప్రకటన సభను ప్రత్యేకంగా నిర్వహిస్తామన్నారు. వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చేందుకు ఎంతోమంది సంప్రదిస్తున్నారన్నారు. కొత్త, పాత వారి సమన్వయం కోసం ఓ కమిటీ ఇప్పటికే పని చేస్తోందని తెలిపారు. వైసీపీ నుంచి వచ్చే వారి పట్ల ఆచితూచి వ్యవహరిస్తామని అచ్చెన్నాయుడు అన్నారు.
టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యేలు - పార్టీ కండువా కప్పి స్వాగతించిన చంద్రబాబు
Nara Bhuvaneshwari Nijam Gelavali Yatra: తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం నుంచి 'నిజం గెలవాలి' పర్యటనలు కొనసాగనున్నాయి. నిజం గెలవాలి పేరుతో రేపటి నుంచి మూడు రోజులపాటు నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. రేపు విజయనగరం జిల్లా, 4వ తేదీన శ్రీకాకుళం జిల్లా, 5వ తేదీన విశాఖ జిల్లాలో భువనేశ్వరి పర్యటన కొనసాగనుంది. చంద్రబాబు అరెస్టు సమయంలో మనస్తాపానికి గురై చనిపోయిన కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించనున్నారు.
ఇప్పటికే పలు కుటుంబాలను ఆమె పరామర్శించారు. ప్రతి వారం మూడు రోజుల పాటు భువనేశ్వరి పర్యటనలు కొనసాగనున్నాయి. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో దాదాపు 200 మంది చనిపోయారని పార్టీ వర్గాలు సమాచారం సేకరించటంతో ఆయా కుటుంబాలన్నింటినీ భువనేశ్వరి పరామర్శించనున్నారు.
చంద్రబాబుకు అరెస్టుతో మద్దతు పెరిగింది - అండగా నిలబడినవారందరికి కృతజ్ఞతలు : భువనేశ్వరి