ETV Bharat / state

రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా నేతల నిరసనలు

రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా నేతలు ఆందోళనలు చేపట్టారు. రాష్ట్రంలో రోజురోజుకి దళితులపై దాడులు పెరుగుతున్నాయనీ.. ప్రభుత్వం వీటిపై స్పందించి.. తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

tdp leaders agitaiton
రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా నేతల నిరసనలు
author img

By

Published : Aug 12, 2020, 7:33 PM IST

నెల్లూరు జిల్లాలో:

రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో తెదేపా జిల్లా ఎస్సీ సెల్ నిరసన కార్యక్రమం చేపట్టింది. నగరంలోని వీఆర్సీ సెంటర్ దగ్గర నిరసన తెలిపిన ఎస్.సి. సెల్ నాయకులు, అంబెడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, దళితులపై దాడులు నివారించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. వైకాపా అధికారం చేపట్టిన 15 నెలల్లో దళితులపై దౌర్జన్యాలు అధికమయ్యాయని ఎస్.సి. సెల్ రాష్ట్ర కార్యదర్శి జన్ని రమణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం రాష్ట్రంలో మాత్రం అమలు కావడం లేదని ఆరోపించారు. గత ప్రభుత్వం 135 కోట్ల రూపాయల ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో అయిదు వేల ఎకరాలు భూమిని కొనుగోలు చేసి దళితులకు పంపిణీ చేస్తే, ప్రస్తుత ప్రభుత్వం నాలుగు వేల ఎకరాల భూమిని దళితుల నుంచి బలవంతంగా లాక్కుందని ఆరోపించారు. ఇప్పటికైనా దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రకాశం జిల్లాలో:

ప్రకాశం జిల్లా కనిగిరిలో తెదేపా నేత ముక్కు ఉగ్రనరసింహరెడ్డి ఆధ్వర్యంలో తెదేపా నేతలు అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ రాష్ట్రములో వైకాపా ఆగడాలు రోజు రోజుకీ ఎక్కువవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన పద్దతి మార్చుకుని ప్రజలపై దాడులు మానుకోవాలని సూచించారు.

తూర్పు గోదావరి జిల్లాలో:

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం రాజ్యాంగ విలువలకు తిలోదకాలు పలుకుతోందని తెదేపా సీనియర్ నేత గొల్లపల్లి సూర్యారావు ఆరోపించారు. ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల ప్రజలపై దాడులు చేయిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా తాటిపాకలో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి.. నివాళులర్పించారు. సీఎం జగన్​కు, వైకాపా నేతలకు మంచి బుద్ధి ఇవ్వాలని అంబేడ్కర్​ను కోరారు. సీతానగరం మండలంలో దళిత యువకుడిపై జరిగిన శిరోముండనం కేసును వైకాపా ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందని ఆయన ఆరోపించారు.

కడప జిల్లాలో:

వైసీపీ సర్కార్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను తిట్టేందుకు ప్రత్యేకంగా ఓ మంత్రి ని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని తెదేపా కడప జిల్లా నాయకుడు పీరయ్య ఎద్దేవా చేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేవలం చంద్రబాబు నాయుడును లక్ష్యంగా ఎంచుకుని జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలతో చెలగాటమాడుతున్నారు అని ఆరోపించారు. రాజధాని కోసం కొన్ని వేల మంది రైతులు తమ భూములను ఇస్తే.. ఇప్పుడు రాజధానిని వైజాగ్​కు మార్చడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కేవలం ఇదంతా వైకాపా కుట్రలో ఓ భాగమేనని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రాల్లో ఒక రాజధాని ఉంటే ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని లేదంటే అమరావతి కోసం పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: బెంగళూరుకు ఏమైంది? ఎందుకింత హింస?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.