గుంటూరు జిల్లాకు చెందిన తెదేపా కార్యకర్త.. తియ్యగూర బ్రహ్మారెడ్డి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఫిరంగిపురం మండలం నుదురుపాడు గ్రామానికి చెందిన బ్రహ్మారెడ్డి.. ఈ పని చేయడానికి కారణం వైకాపా నాయకుల వేధింపులే అని అతని కుటుంబీకులు ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతున్న కారణంగానే ఇలా జరిగిందని ఆవేదన చెందారు. పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో ఉన్న బ్రహ్మారెడ్డిని నరసారావుపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అతని జేబులో ఉందంటూ.. ఓ లేఖను చూపించారు. అందులో.. సీతారామిరెడ్డి, ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి, తియ్యగూర అంజిరెడ్డి పేర్లున్నాయి. వారే ఈ ఘటనకు కారణమని రాసి ఉంది.
ఇదీ చదవండి: