చిలకలూరిపేట గాంధీపేటలోని ఓ టైలర్ దుకాణ నిర్వాహకుడు మంగళవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతి చెందిన వ్యక్తి నాంపల్లి మస్తానయ్య(38)గా పోలీసులు గుర్తించారు. మద్దిరాల గ్రామానికి చెందిన మస్తానయ్య.. పట్టణంలోని గాంధీపేటలో టైలర్ దుకాణం నిర్వహించేవాడు. కొవిడ్ నేపథ్యంలో దుకాణం తీసే అవకాశం లేకపోవడం వల్ల గ్రామంలో మరో షాపు అద్దెకు తీసుకుని అక్కడే టైలర్ దుకాణం పెట్టాడు.
ఇటీవలే మస్తానయ్య మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని... ఆ మహిళ తరపు బంధువులు వచ్చి బెదిరించినట్లు విచారణలో తెలిసిందంటూ చిలకలూరిపేట అర్బన్ ఎస్సై షఫీ తెలిపారు. ఈ క్రమంలోనే పట్టణంలో దుకాణం ఖాళీ చేస్తున్నా అని చెప్పి.. షాప్‌లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇదీ చదవండి: