గుంటూరులో స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్స్ ఆందోళన బాట పట్టారు. తమకు ఇచ్చే పే అవుట్లు తగ్గించి.. టార్గెట్లు ఎక్కువ చేస్తున్నారని వాపోయారు. మదర్ థెరిసా కూడలి నుంచి స్విగ్గీ కార్యాలయం వరకు నిరసనగా ర్యాలీ చేశారు. కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. గతంలో వారానికి 2,500 రూపాయల టార్గెట్ పూర్తి చేయటమే కష్ట తరంగా ఉంటే, ఇప్పుడు 3,500 రూపాయల టార్గెట్ పెట్టి తమను ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. ఇప్పటికైనా యాజమాన్యం నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: