గుంటూరు నగర శివారులోని వెంగళాయపాలెం ప్రాంతంలో మిర్చియార్డు కూలీలు ఇళ్ల స్థలాలను కొనుగోలు చేశారు. స్థలాలను ఖాళీ చేయించేందుకు అధికారులు ఇటీవల చర్యలు ముమ్మరం చేసిన క్రమంలో బాధితులు స్థలాలను ఖాళీ చేయించొద్దని...తమ స్థలాలను తమకే కేటాయించి పట్టాలు ఇప్పించాలని కోరుతున్నారు. లేని క్రమంలో తాము పురుగు మందు సేవించి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. స్థలాల వద్దకు వచ్చిన అధికారులకు అక్కడి వారంతా పురుగుమందు డబ్బాలతో నినాదాలు చేయటంతో వారు వెనుదిరగాల్సి వచ్చింది. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవీ చదవండి...'వైకాపా 9నెలల పాలనలో... రాష్ట్రం తొమ్మిదేళ్లు వెనక్కి'