గుంటూరు జిల్లా పొన్నూరులో అకాల వర్షంతో మిర్చి, మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొండముది గ్రామంలో పిడుగు పడి రెండెకరాల గడ్డివాము దగ్ధమైంది. ఇప్పటికే చేబ్రోలు మండలం గుండవరం, గొడవర్రు, చేకూరు, సెలపాడు, శుద్ధపల్లి గ్రామాలతో పాటుగా పెదకాకాని మండలంలోని పలు గ్రామాల్లో మిర్చి పంట కోసి ఆరబోశారు. కరోనా వైరస్ కారణంగా చేతికి వచ్చిన పంటను అమ్ముకునేందుకు అవకాశం లేక పొలాల్లోనే ఉంచారు. మొక్కజొన్న కోతకు వచ్చినా.. కూలీలు దొరక్క అవస్థ పడుతున్నారు. ఇలాంటి సమయంలో కురిసిన అకాల వర్షం అన్నదాతలకు కన్నీరు తెప్పిస్తోంది. పంటలపై తాత్కాలికంగా పరదాలు కప్పి వర్షం నుంచి కాపాడుకుంటున్నారు.
ఇదీ చూడండి: