మంగళగిరిలో తూనికలు, కొలతల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పట్టణంలోని బేకరీ, స్వీట్స్, ఎలక్ట్రికల్, కిరాణా దుకాణాల్లో తనిఖీలు చేశారు. కొలతలు, తయారీ తేదీలు, నాణ్యత లోపంతో సరుకులు విక్రయిస్తున్న దుకాణాలకు జరిమానా విధించారు. నిబంధనలు పాటించని పది దుకాణాదారులకు 65వేల రూపాయలు జరిమానా విధించారు. దాడుల్లో సాంకేతిక సహాయకులు శివ శంకర్, సయ్యద్ సలీం పాల్గొన్నారు.
ఇదీ చదవండి: వినుకొండలో నకిలీ పాసు పుస్తకాలతో బురిడీ