మంగళగిరిలో ఎరువులు, క్రిమిసంహారక మందుల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. రెండు దుకాణాల్లోని నిల్వల్లో తేడాలున్నట్లు అధికారులు గుర్తించారు. రైతుల సంతకాలు లేకుండా మందుల విక్రయాలు జరుపుతున్నట్లు కనుగొన్నారు. వీటితో పాటు రెండున్నర లక్షల విలువైన కాలం చెల్లిన మందులు ఉన్నట్లు గుర్తించి వాటిని జప్తు చేసుకున్నారు. రెండు దుకాణాలపై కేసులు నమోదు చేసినట్లు విజిలెన్స్ ఎస్సై లక్ష్మారెడ్డి చెప్పారు.
ఇదీ చదవండి: అక్రమంగా నిల్వ ఉంచిన 64 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత