ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సబ్సిడీ కింద ఇన్నోవా, ఇతిఓస్, మొబైల్ ఏసర్ కార్లను రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అందించారు. ఆంధ్రప్రదేశ్ తోళ్ల పరిశ్రమ అభివృద్ధి సంస్థ తరపున దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు కార్గో వాహనాలను పంపిణీ చేశారు.
జగనన్న చర్మ కారుల రథం పేరుతో ఈ వాహనాలతో మొబైల్ తరహా వ్యాపారాన్ని చేస్తున్నట్లు లబ్ధిదారులు తెలిపారు. ఈ వాహనాల్లో లెదర్ చెప్పులు, బ్యాగ్లు, బెల్టులు అమ్మేందుకు వీలుగా ఉంటుందని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు.