ETV Bharat / state

ఆ జీవో వెనక్కి తీసుకోవాలంటూ.. విద్యార్థి సంఘాల ఆందోళన

author img

By

Published : Nov 10, 2021, 1:47 PM IST

Updated : Nov 10, 2021, 9:41 PM IST

అనంతపురంలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్​కు నిరసనగా.. రాష్ట్రంలోని పలుచోట్ల విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. జీవో నెంబర్ 42ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

student-union-leaders-protest-for-go-number-42-should-withdraw
జీవో నెంబర్ 42ను వెనక్కి తీసుకోవాలంటూ విద్యార్థి సంఘాల ఆందోళన

అనంతపురంలో విద్యార్థులపై పోలీసుల తీరుకు నిరసనగా.. రాష్ట్రంలో పలుచోట్ల విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. విజయవాడ ఎస్​.ఆర్.ఆర్ కళాశాల ప్రాంగణంలో నిరసన చేపట్టారు. గుంటూరులో టీఎన్​ఎస్​ఎఫ్​ నేతలు ధర్నా నిర్వహించారు. హిందూ కళాశాల ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎయిడెడ్ కళాశాలను విలీనం చేస్తూ తీసుకువచ్చిన జీవో నెంబర్ 42ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అనంతపురంలో..

ఎయిడెడ్ కళాశాలల కొనసాగించాలని అనంతపురంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఎస్​ఎస్​బిఎన్​ కళాశాల వద్ద ధర్నా చేస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ధర్నాలు చేయకూడదని ఏదైనా ఉంటే కళాశాల యాజమాన్యానికి వినతిపత్రం ఇవ్వాలని విద్యార్థులకు పోలీసులు సూచించారు. తాము ఆందోళన చేయడానికి రాలేదని ఫీజులు తగ్గించి ఎయిడెడ్ కళాశాల కొనసాగించాలని శాంతియుతంగా నిరసన తెలియజేస్తామని పోలీసులకు విద్యార్థులు వివరణ ఇచ్చారు.

వైకాపా పాలనలో విద్యార్థులపై పోలీసుల దాడులను ఖండిస్తూ అనంతపురంలోని ఆర్​కె ఫంక్షన్ హాల్​లో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమానికి నారా లోకేశ్​ వస్తున్న సందర్భంగా ఆర్​కె ఫంక్షన్​ హాల్​ దగ్గర పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

విజయవాడలో..

అనంతపురంలో విద్యార్థిని, విద్యార్థులపై జరిగిన పోలీసులు అమానుషంగా చేసిన లాఠీఛార్జ్​ని ఖండిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయవాడ ఎస్​ఆర్​ఆర్​ కళాశాల ప్రాంగణంలో విద్యార్ధులు నిరసన కార్యక్రమం చేపట్టారు. తమ న్యాయమైన హక్కుల కోసం శాంతియుత ఆందోళన చేస్తున్న విద్యార్థులను అసాంఘిక శక్తులని ముద్రవేస్తూ లాఠీఛార్జ్​ చేయటం అమానుషం అని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్ధులకు క్షమాపణ చెప్పి తమ డిమాండ్లను పరిష్కరించాలని ఎస్​ఎఫ్​ఐ నాయకులు డిమాండ్​ చేశారు.

విజయనగరంలో..

అనంతపురంలో విద్యార్థులపై పోలీసులు జరిపిన దాడిని ఖండిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టర్ కార్యాలయం ఎదుట విద్యార్థులు నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో విద్యా రంగాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తానని చెప్పి, ఇప్పుడు ఉన్నత విద్య ఉందో.. లేదోననే స్థితికి తీసుకువెళ్లారని వ్యాఖ్యానించారు. తక్షణమే జిఓ నెం.42,35 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

అనంతపురం జిల్లాలో..

అనంతపురంలో విద్యార్థులపై పోలీసుల తీరుకు నిరసనగా హిందూపురంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. భాజపా కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకొని తోపులాటకు దారితీసింది. విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా హిందూపురం పట్టణంలో భాజపా కార్యకర్తలు ముఖ్యమంత్రి జగన్​ దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు.

చిత్తూరు జిల్లాలో..

అనంతపురం జిల్లాలో విద్యార్థులపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్​ చేయాలని డిమాండ్​ చేస్తూ చిత్తూరు జిల్లా మదనపల్లెలో భాజపా నాయకులు ధర్నా చేశారు. పట్టణంలోని ఎన్టీఆర్ కూడలిలో రోడ్డు మీద నిలబడి వాహనాల రాకపోకలను దిగ్బంధించారు. తక్షణమే పోలీసులపై కేసు నమోదు చేయాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.

కర్నూలులో..

ఎయిడెడ్ పాఠశాలను కొనసాగించాలని భాజపా, జనసేన పార్టీల ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేశారు. ప్రభుత్వ నిర్ణయాలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేవైయం రాష్ట్ర నాయకురాలు బైరెడ్డి శబరి అన్నారు. విద్యా సంవత్సరం మద్యలో పాఠశాలలు మూసివేస్తే విద్యార్థుల భవిష్యత్ ఏంటని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

అనంతపురం జిల్లాలో విద్యార్థులపై దాడి చెయ్యడం సిగ్గు చేటని విద్యార్థుల పై దాడిచేసిన పోలీసులను సస్పెండ్ చెయ్యాలని ఆమె డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయం లోకి వెళ్లేందుకు బీజేపీ నాయాకులు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.

గుంటూరు జిల్లాలో..
గుంటూరు జిల్లా మంగళగిరిలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. దాదాపు వంద సంవత్సరాల చరిత్ర ఉన్న మంగళగిరి విద్యాసంస్థలను కాపాడాలంటూ విద్యార్థులు టీఎన్ఎస్ఎఫ్ నేతలు భారీ ప్రదర్శన చేశారు. మంగళగిరి గాలిగోపురం గౌతమ్ బుద్ధ రహదారిపై వందలాది విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేశారు.

విజయవాడలో..

విజయవాడలో ఎయిడెడ్ కళాశాల గతంలో ఎయిడెడ్ గా ఉన్న ప్రైవేట్ కళాశాలగా మార్చటంతో కళాశాలల యజమానులు విద్యార్ధుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షులు చరణ్ ఆరోపించారు. విజయవాడ కేబీఎన్​ కళాశాలలో విద్యార్ధుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని సీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కంటే ఎక్కువ ఫీజును వసూలు చేస్తుండటంతో విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రెగ్యులేషన్ కమిషన్ దీనిపై దృష్టి పెట్టాలని కోరారు.

ఇదీ చూడండి: LIVE VIDEO : మూతికి నిప్పు.. అలరించబోయి విలపించాడు..!

Last Updated : Nov 10, 2021, 9:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.