ETV Bharat / state

'ఏఎన్​యూ ఉపకులపతి రాజీనామా చేయాలి'

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి వెంటనే రాజీనామా చేయాలని.. విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. నలుగురు విద్యార్థులను అన్యాయంగా సస్పెండ్ చేశారని ఏఎన్​యూ ఎదుట ఆందోళన నిర్వహించాయి.

student jac dharnaa at Acharya Nagarjuna University
నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద విద్యార్థి సంఘాల ధర్నా
author img

By

Published : Feb 3, 2020, 2:00 PM IST

నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద విద్యార్థి సంఘాల ధర్నా

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జై అమరావతి అన్నందుకు నలుగురు విద్యార్థులను సస్పెండ్​ చేసిన తీరును నిరసిస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. విద్యార్థి సంఘాల ఐకాస నేతలు విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. విద్యార్థులను సస్పెండ్ చేసిన ఉపకలపతి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు మద్దతుగా తెదేపా నేతలు నిరసనలో పాల్గొని...సంఘీభావం తెలిపారు. వైకాపాకు కొమ్ముకాస్తున్న ఉపకులపతి వ్యవహారంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలుగుదేశం నాయకులు తెలిపారు.

ఇవీ చదవండి..

ఏఎన్‌యూ విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేత

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.