ఏఎన్‌యూకు చెందిన నలుగురు విద్యార్థులపై యాజమాన్యం సస్పెన్షన్ ఎత్తివేసింది. వివిధ వర్గాల నుంచి వచ్చిన ఒత్తిళ్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. జై అమరావతి నినాదాలు చేశారని శనివారం రాత్రి యాజమాన్యం సస్పెండ్ చేసింది.
'వీసీ రాజీనామా చేయాలి'
మరోవైపు యూనివర్సిటీ ఎదుట విద్యార్థులు దర్న చేస్తున్నారు. వీసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.