హిందూ దేవాలయాలపై దాడులకు పాల్పడుతున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. దాడులను ఖండిస్తూ గుంటూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ప్రభుత్వం దాడులపై స్పందించకపోగా.. దృష్టి మళ్లించేలా.. ప్రతిపక్షాలపై మండిపడుతూ మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నాలో హిందూ ఐక్య పోరాట సమితి, శ్రీరామ్ సేన, హిందూ సేన పాల్గొన్నారు. ఆందోళనకారులు కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. సమితి గౌరవ అధ్యక్షులు శ్రీనివాసానంద స్వామి, పలువురు స్వామిజీలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: బాపట్ల కేంద్రంగా నాణ్యమైన ఆక్వా హేచరీ ఉత్పత్తులు..