ETV Bharat / state

నత్తనడకన ఎస్​టీపీ పనులు.. ఎప్పుడు తీరేనో మురుగుతో సమస్యలు!

గుంటూరు జిల్లాలోని నర్సారావుపేట, చిలకలూరిపేట పట్టణాల్లోని గృహాల ద్వారా వచ్చే వృథా నీటిని శుద్ధి చేసే సీపేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల(ఎస్‌టీపీ) పనులు కొన్నిచోట్ల ఏళ్లుగా సాగుతూనే ఉన్నాయి. శుద్ధి చేసిన నీటిని వాగులు, కుంటల్లోకి వదిలితే కాలుష్య నివారణతో పాటు వ్యవసాయానికి పనికి వస్తాయన్న ఆలోచనతో గత ప్రభుత్వ హయాంలో చిలకలూరిపేటలో ఎస్‌టీపీ పనులు ప్రారంభించారు.

author img

By

Published : Apr 24, 2021, 3:41 PM IST

works
works

గుంటూరు జిల్లాలోని నర్సారావుపేట, చిలకలూరిపేట పట్టణాల్లోని గృహాల ద్వారా వచ్చే వృథా నీటిని శుద్ధి చేసే సీపేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల(ఎస్‌టీపీ) పనులు కొన్నిచోట్ల ఏళ్లుగా సాగుతూనే ఉన్నాయి. కొంతమేర పనులు జరగ్గానే సార్వత్రిక ఎన్నికలు వచ్చిన కారణంగా పనులు ఆగిపోయియి. శుద్ధి చేసిన నీటిని వాగులు, కుంటల్లోకి వదిలితే కాలుష్య నివారణతో పాటు వ్యవసాయానికి పనికి వస్తాయన్న ఆలోచనతో గత ప్రభుత్వ హయాంలో చిలకలూరిపేటలో ఎస్‌టీపీ పనులు ప్రారంభించారు. నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యాక పనులు కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసినా నిధులు విడుదలలో జాప్యం, ఇసుక విధానం, కొవిడ్‌ నేపథ్యంలో కూలీల కొరతతో మురుగు నీటి శుద్ధి కేంద్రాల పనులు ఆలస్యమవుతున్నాయి. జిల్లాలో లక్ష జనాభా పైన ఉన్న చిలకలూరిపేట, తెనాలి, నరసరావుపేట, గుంటూరులో ఎస్‌టీపీలు ఏర్పాటు చేయాల్సి ఉండగా వీటిలో నరసరావుపేట మినహా మిగిలినచోట్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి.

చిలకలూరిపేట పట్టణాన్ని నాలుగు జోన్‌లుగా చేసి నాలుగు చోట్ల ఎస్‌టీపీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించారు. దీనిలో భాగంగా మొదటగా అమృత్‌పథకం-2 కింద బొందిలపాలెం సమీపంలో ఓగేరువాగు పక్కన ఎస్‌టీపీ ఏర్పాటుకు స్థలం కేటాయించారు. ఇది ఆక్రమణలో ఉండడంతో వివాదాలతో ఏడాది పాటు కాలాతీతమైంది. చివరికి స్థల వివాదం ముగియడంతో పనులు ప్రారంభించారు. మొత్తం రూ.16 కోట్లతో నిర్మించనున్న ఎస్‌టీపీ పనులకు ప్రస్తుతం రూ.1.50కోట్ల విలువైన పనులు మాత్రమే జరిగాయి. ప్రస్తుతం అవి నత్తనడకన సాగుతున్నాయి. తెనాలి పట్టణంలో 11వ వార్డులోని పూలేకాలనీలో అమృత్‌ ఫేజ్‌-2 కింద రూ.30 కోట్లతో పనులను ప్రారంభించారు. ఇప్పటివరకు రూ.8 కోట్లు పనులు మాత్రమే జరిగాయి. నిధుల విడుదల జాప్యంతో ప్రస్తుతం పనులు నిలిచిపోయాయి. గుంటూరులో ఐదుచోట్ల ఎస్‌టీపీలు పనులు ప్రాంభించారు. అన్నీ కూడా అసంపూర్తిగానే ఉన్నాయి.

నరసరావుపేటలో 12వేల ఇళ్లకు మాత్రమే..

మురుగు నీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ యూనిట్‌) నరసరావుపేట పురపాలక సంఘానికి వరం. జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ నూతన సాంకేతిక పరిజ్ఞానంతో మురుగు నీటి శుద్ధి కేంద్రం నిర్మించారు. 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి నగరబాటలో భాగంగా యూజీడీ(అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ)కి శంకుస్థాపన చేశారు. పైపులైన్‌ ఏర్పాటు, మ్యాన్‌హోళ్ల నిర్మాణం తదితర పనులు కోసం రూ.32 కోట్లు నిధులు ఖర్చు చేశారు.

అయితే... పథకం అందుబాటులోకి రావడంలో జాప్యం చోటు చేసుకుంది. ఎట్టకేలకు 2011లో యూజీడీ పథకం పనులు పూర్తి చేశారు. ఎస్‌టీపీ ట్యాంక్‌ నిర్మాణం, ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చేందుకు 2015లో అప్పటి ప్రభుత్వం రూ.30 కోట్ల నిధులు కేటాయించింది. వీటితో మురుగునీటి శుద్ధి కేంద్రం ప్లాంట్‌ను అందుబాటులోకి తెచ్చారు. నరసరావుపేట పట్టణ పరిధిలో 12వేల ఇళ్లకు కనెక్షన్‌ ఇచ్చారు. మిగతా గృహాలకు ఇచ్చేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. 15.54 ఎంఎల్‌డీ సామర్థ్యంతో ఎస్‌టీపీ ట్యాంకు నిర్మించారు.

పట్టణంలోని నివాస గృహాల నుంచి వృథా నీరు పైపులైన్‌ ద్వారా ఇక్కడకు చేరుతుంది. పలు దశల్లో ఆ నీటిని శుద్ధి చేసి పక్కన ఉన్న కాల్వలోకి వదులుతున్నారు. పట్టణ పరిధిలోని పార్కులు, ప్రధాన రహదారుల పక్కనున్న మొక్కలకు ఈ కేంద్రం నుంచి బయటకు వచ్చే నీటిని వినియోగించేందుకు పైప్‌లైన్‌ ఏర్పాటు చేశారు. త్వరలోనే ఇక్కడ శుద్ధి చేసిన నీటిని ట్యాంకర్ల ద్వారా తీసుకెళ్లి పట్టణంలోని మొక్కలకు వినియోగిస్తామని అధికారులు చెబుతున్నారు. యూజీడీ పథకం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే పట్టణంలో దోమల బెడద తొలగడమే కాక.. మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది.

నరసరావుపేటలో ఇప్పటి వరకు 12వేల గృహాలకు మాత్రమే యూజీడీ పథకం కింద కనెక్షన్లు ఇచ్చారు. మరో 15 వేల గృహాలకు కనెక్షన్‌ ఇచ్చేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. కోటప్పకొండ రోడ్డు, చంద్రబాబునాయుడు కాలనీ తదితర ప్రాంతాలకు యూజీడీ వసతి కల్పించేందుకు అధికారులు అంచనాలు రూపొందించారు. పట్టణ పరిధి పెరుగుతున్న నేపథ్యంలో ఒకేసారి అన్ని ప్రాంతాలకు యూజీడీ సౌకర్యం కల్పించేందుకు నిధులు కేటాయించాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

వేగంగా జరిగేలా చర్యలు

చిలకలూరిపేట ఎస్టీపీ పనులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేస్తాం. నిధులు విడుదలలో జాప్యంతో పాటు కొవిడ్‌ నేపథ్యంలో నెమ్మదిగా జరుగుతున్నాయి. రూ.16 కోట్లకు గాను కోటిన్నర పనులు జరిగాయి. వేగవంతంగా చేయించి ఎస్టీపీని పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నాం.- శ్రీనివాసరావు, చిలకలూరిపేట పబ్లిక్‌ హెల్త్‌ డీఈ

మిగతా నివాసాలకు కనెక్షన్‌ ఇచ్చేలా ప్రతిపాదనలు

పురపాలక సంఘం పరిధిలో ఉన్న నివాసాలు అన్నింటికి భూగర్భ మురుగునీటి పథకం కనెక్షన్‌ ఇచ్చేందుకు అవసరమైన నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరైతే టెండర్లు పిలిచి ప్రతి ఇంటికి యూజీడీ కనెక్షన్‌ ఇస్తాం. పట్టణ పరిధిలో అన్ని ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వటం పూర్తయితే దోమల బెడద, మురుగు సమస్యలు తొలగిపోతాయి. నరసరావుపేట యూజీడీ పథకం ఎలాంటి ఆటంకం లేకుండా పని చేస్తోంది. - రామచంద్రారెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌

ఇదీ చదవండి:

సంగం డెయిరీ కార్యాలయంలో ఏసీబీ అధికారుల తనిఖీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.