తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సమయానికి వైద్యం అందటం లేదన్న రోగుల ఫిర్యాదులతో.. రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ రామకృష్ణారావు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని.. సిబ్బంది కోరత ఉండటంతో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని వెల్లడించారు. పూర్తిస్థాయి సిబ్బంది వచ్చే వరకు ప్రస్తుతం ఉన్న వారు ఆదివారం కూడా పనిచేయాలని డీఎంహెచ్ఓకి సూచించారు. తల్లి - పిల్లల ఆసుపత్రిలో భోజనం, నాణ్యత లోపంగా ఉందని.. వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. మరుగుదొడ్లు, ఇతర మరమ్మత్తు పనులను వేగంగా పూర్తి చేయిస్తామన్నారు.
'మమ్మల్ని ఆదుకోండి సారూ'
కనిగిరికి చెందిన ఓ వ్యక్తి తన భార్యను ప్రసవం కోసం తెనాలి ఆసుపత్రికి తీసుకువచ్చానని.. కానీ ఇక్కడ సౌకర్యాలు సరిగా లేవని ఆరోపించారు. బాలింతలకు సరైన ఆహరం ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోగుల సహాయకులకు వసతి సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: