ETV Bharat / state

Panchayats funds: కేంద్రం నిధులపై రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషీ - కేంద్రం ఇచ్చే పంచాయతీ నిధులపై ప్రభుత్వ కన్ను

Panchayats funds: గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇచ్చే నిధులపైనా రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషీ చేస్తోంది. విద్యుత్తు ఛార్జీలు, క్లాప్‌మిత్రల బకాయిలకు ఆర్థిక సంఘం నిధుల నుంచి చెల్లించాలని హుకుం జారీ చేసింది. దీనిపై గ్రామ ప్రథమ పౌరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోగా...కేంద్రం ఇచ్చిన వాటిపైనా పెత్తనమేంటని ప్రశ్నిస్తున్నారు.

panchayats funds
పంచాయతీలకు కేంద్రం ఇచ్చే నిధులపై ప్రభుత్వం అజమాయిషీ
author img

By

Published : Oct 31, 2022, 7:46 AM IST

పంచాయతీలకు కేంద్రం ఇచ్చే నిధులపై ప్రభుత్వం అజమాయిషీ

Panchayats funds: సర్పంచులను రాష్ట్ర ప్రభుత్వం కట్టుబానిసల్లా మార్చింది. కేంద్ర నిధులనూ తాము చెప్పినట్లే ఖర్చుచేయాలంటూ వారి మెడపై కత్తి పెడుతోంది. ఓ వైపు పాలన వికేంద్రీకరణ అంటూ.. మరోవైపు పల్లె పాలనలో మితిమీరిన జోక్యంతో పంచాయతీ వ్యవస్థను నాశనం చేస్తోంది. సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టి పంచాయతీలను ఇప్పటికే నిర్వీర్యం చేసింది. గ్రామాలకు కేంద్రం కేటాయిస్తున్న ఆర్థిక సంఘం నిధుల వ్యయంపై పంచాయతీల్లో తీర్మానం చేయకముందే.. అవి ఎలా ఖర్చుచేయాలో ప్రభుత్వమే నిర్దేశిస్తోంది. ఈ ఆదేశాలు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసమైతే ప్రజలు సంతోషించేవారు.

విద్యుత్తు ఛార్జీలకు, ప్రభుత్వం తరఫున క్లాప్‌మిత్రలకు చెల్లించాల్సిన గౌరవ వేతన బకాయిల కోసం ఆర్థిక సంఘం నిధులు వెచ్చించాలని హుకుం జారీచేస్తోంది. 2021 - 22 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం కేటాయించిన 948 కోట్ల 34 లక్షల 15వ ఆర్థిక సంఘం నిధుల విషయంలో సర్పంచులకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. విద్యుత్తు ఛార్జీల బకాయిలు, క్లాప్‌మిత్రల గౌరవ వేతనాల బిల్లులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని పంచాయతీలను ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ తాజా ఆదేశాలతో గ్రామాల్లో కొత్తగా పనులేవీ చేయలేమని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోగా, కేంద్రం ఇచ్చినవాటిపైనా పెత్తనమేంటని ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటికే గ్రామాల్లో చేసిన పనుల బిల్లుల చెల్లింపునకు, కొత్త పనులకు ఆర్థికసంఘం నిధులు వినియోగించుకోవచ్చు. గత ఏడాదిన్నరలో 350 కోట్ల పనుల బిల్లుల చెల్లింపులకు... కొత్తగా మరో 550 కోట్ల పనులకు ఆర్థిక సంఘం నిధులు ఖర్చుచేయాలని సర్పంచులు భావించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ పీడీ ఖాతాల్లో నిధులు జమచేసినట్లే చేసి... తిరిగి బకాయిల పేరుతో వెనక్కి తీసుకోవడంపై ...గ్రామ ప్రథమ పౌరులు మండిపడుతున్నారు. సర్‌ఛార్జ్‌లతో కలిపి 3వేల 643 కోట్లకుపైగా విద్యుత్తు బకాయిలు చెల్లించాలని పీడీ ఖాతాలకు ఆర్థికసంఘం నిధులు జమ చేసినప్పుడు పంచాయతీలకు ప్రభుత్వం సర్క్యులర్‌ జారీచేసింది. ఇందులో నుంచి 14 వందల34 కోట్ల 80 లక్షల సర్‌ఛార్జీ భారం నుంచి బయటపడాలంటే విద్యుత్తు బకాయిలు 2వేల 208 కోట్ల 93 లక్షల ఆర్థిక సంఘం నిధుల్లోంచి చెల్లించాలని ఆదేశాలిచ్చింది. గత 15 రోజుల్లో పంచాయతీల నుంచి విద్యుత్తు పంపిణీ సంస్థలు దాదాపు 50 కోట్ల విద్యుత్తు బకాయిలు వసూలు చేశాయని తెలుస్తోంది.

ఇళ్ల నుంచి చెత్త సేకరిస్తున్న, షెడ్లలో పనిచేస్తున్న 46వేల మంది క్లాప్‌ మిత్రలకు ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు చెల్లించాల్సిన 6 నెలల గౌరవ వేతనం బకాయిలు 165 కోట్ల 60 లక్షలను ఆర్థిక సంఘం నిధుల్లోంచే చెల్లించాలని ప్రభుత్వం తాజాగా ఆదేశించింది. గతంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ వీరి వేతనాలకు నిధులిచ్చేది. ఈ ఏడాది మార్చి నుంచి అవి నిలిపివేయడంతో ..ఆర్థిక సంఘం నిధుల్లోంచి చెల్లించాలని అధికారులు పంచాయతీలకు ఆదేశాలిచ్చారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.