ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగించేలా పాలకుల మనసు మారాలంటూ.. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం శైవక్షేత్రంలో శ్రీవిద్యా మహాయాగం చేపట్టారు. పీఠాధిపతి శివస్వామి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి శ్రీవిద్యా మహాయాగాన్ని ప్రారంభించారు. సోమవారం నుంచి తొమ్మిది రోజుల పాటు.. యాగం నిర్వహించనున్నారు. తొమ్మిదో రోజు మహా పూర్ణాహుతి నిర్వహిస్తామని శివస్వామి చెప్పారు.
ఉద్ధండరాయునిపాలెంలోని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో యాగం నిర్వహణకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో శైవక్షేత్రంలో ఏర్పాటు చేశామని తెలిపారు. శ్రీ విద్యా మహాయాగంలో.. రాజధాని మహిళలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రైతులతో 10వ దఫా చర్చలు వాయిదా