ETV Bharat / state

అగ్రదేశాల వైరం... రాష్ట్ర స్పిన్నింగ్ మిల్లుల్లో సంక్షోభం

రాష్ట్రంలో స్పిన్నింగ్ మిల్లులు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. చైనా - అమెరికా మధ్య వాణిజ్య యుద్ధంతో అంతర్జాతీయంగా మారిన పరిస్థితులు... మన స్పిన్నింగ్ మిల్లుల గిరాకీని తగ్గించాయి. ఫలితంగా 8 నెలలుగా డిమాండ్ కరవై మిల్లుల్లో దారం నిల్వలు పేరుకుపోతున్నాయి. సరైన ప్రణాళిక, అంచనా లేక వివిధ రాష్ట్రాల్లో డిమాండ్​కు మించిన ఉత్పత్తితో నష్టాలు ఎదురవుతున్నాయి.

స్పిన్నంగ్ మిల్లులు
author img

By

Published : Jun 4, 2019, 8:33 AM IST

సంక్షోభంలో స్పిన్నింగ్ మిల్లులు

దేశంలో వ్యవసాయరంగం తర్వాత అత్యధికంగా ఉపాధి, విదేశీ మారకద్రవ్యం అందిస్తుంది చేనేత, జౌళిరంగమే. ఇంతటి కీలకరంగం యేటా ఏదో సమస్యతో ఎదురీదుతూనే ఉంది. పత్తి నుంచి దారం తీసే స్పిన్నింగ్ మిల్లులు.. ప్రస్తుతం దినదినగండంగా నడుస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో 120 వరకు స్పిన్నింగు మిల్లులుండగా... వీటి వద్ద 360 కోట్ల రూపాయల విలువ చేసే కోటి 80 లక్షల కిలోల దారం నిల్వలున్నాయి. దేశంలో తయారయ్యే దారంలో 25 శాతానికి పైగా చైనాకు ఎగుమతి జరిగేది. అమెరికా- చైనా మధ్య వాణిజ్యపరంగా విబేధాలు తలెత్తి... చైనా నుంచి అమెరికాకు దుస్తుల ఎగుమతులు మందగించాయి. అదే సమయంలో మనదేశం నుంచి చైనాకు ముడి దారం ఎగుమతుల డిమాండ్ తగ్గిపోయింది. ఎగుమతులు లేక.... దేశీయ వస్త్ర పరిశ్రమ అవసరాలకు మించి ఉత్పత్తి చేసినందున గిరాకీ తగ్గింది. 25వేల స్పిండిల్స్ ఉన్న మిల్లు... నెలకు సమారు 40 లక్షల రూపాయల వరకు నష్టాలు మూటకట్టుకుంటోంది.

పట్టించుకోని ప్రభుత్వం

దేశంలో ప్రస్తుతం పత్తి నుంచి దారం తీసే జిన్నింగ్, స్పిన్నింగ్ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ మౌలిక సదుపాయాల కల్పనకు అనుకున్నంతగా ప్రయత్నాలు సాగడం లేదు. కేంద్రం పరిశ్రమలకు టెక్నాలజీ అప్​గ్రేడేషన్ కింద ఇచ్చే వడ్డీ రాయితీ సొమ్మును 2012 నుంచి విడుదల చేయడం లేదు. GST రాకముందు దారాన్ని ఎగుమతి చేస్తే ఎగుమతి విలువలో 3 శాతాన్ని ప్రభుత్వం ప్రోత్సాహకం రాగా... ప్రస్తుతం 1.7 శాతంగా అందిస్తున్నారు. ఇది కూడా సకాలంలో విడుదల కావడం లేదు. మేకిన్ ఇండియాకు ప్రాధాన్యమిస్తోన్న కేంద్రప్రభుత్వం... స్పిన్నింగ్ పరిశ్రమను గట్టెక్కించేలా చర్యలు చేపట్టాలని పారిశ్రామిక వర్గాలు కోరుతున్నాయి.

Intro:AP_ONG_61_03_POLICE_AVARNES_PROGRAME_AVB_C4

కంట్రిబ్యూటర్ నటరాజు

సెంటర్ అద్దంకి

--------------------------------------

ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో జరుగుతున్న ప్రమాదాల నివారణ ధ్యేయంగా పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. హెల్మెట్ పెట్టుకో..... గులాబీ పువ్వు అందుకో.....

అద్దంకి సీఐ హైమా రావు ఆధ్వర్యంలో అద్దంకి పోలీసులు
రహదారిపై హెల్మెట్ తొ ప్రయాణిస్తున్న ప్రయాణికుల కు అభినందనలు తెలుపుతూ గులాబీ పువ్వులను అందిస్తున్నారు. కార్ల లో ప్రయాణించే వారికి సీట్ బెల్ట్ పెట్టుకోవాలంటే సూచనలు ఇస్తున్నారు. హెల్మెట్ పెట్టుకోకపోయినా సీట్ బెల్ట్ వేసుకోకపోయినా జరిగే అనర్ధాల గురించి ప్రయాణికులకు పోలీసులు తెలుపుతున్నారు.అనుకోని ప్రమాదం జరిగిన అప్పటికి హెల్మెట్ ధరించడం వలన ఎలాంటి గాయాలు కాకుండా ఉంటాయని మరియు సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ప్రమాదం జరిగినప్పటికీ ప్రాణాలతో బయట పడవచ్చని ప్రయాణికులకు తెలిపారు.

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.