ETV Bharat / state

పన్నులు చెల్లించకుండా వేరుసెనగ తరలింపు - Peanut moveing without tax payments in gunutur district

రైతుల నుంచి కొనుగోలు చేసిన పంట ఉత్పత్తులను రవాణా చేసేందుకు ప్రభుత్వ శాఖలకు పన్ను చెల్లించాలి. అయితే కొందరు వ్యాపారులు తెలివిగా దొడ్డిదారిని ఎంచుకుంటున్నారు. మార్కెట్ సెస్, అమ్మకపు పన్ను చెల్లించకుండా ప్రభుత్వానికి రావాల్సిన రూ.కోట్ల ఆదాయానికి గండి కొడుతున్నారు. వేరుసెనగ, ధాన్యాన్ని దొంగ మార్గాల్లో రవాణా చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. తీర ప్రాంతం నుంచి రూ.వందల కోట్ల విలువైన పంట ఉత్పత్తులను జిల్లా సరిహద్దులు దాటించేసి కాసులు వెనకేసుకుంటున్నారు.

వేరుశనగ తరలింపు
peanuts moving
author img

By

Published : Apr 23, 2021, 3:15 PM IST

తీర ప్రాంతంలో 5385 హెక్టార్లలో వేరుసెనగ సాగవుతుంది. హెక్టారుకు 80 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోంది. గుంటూరు జిల్లాలోని చెరుకుపల్లి, నగరం, నిజాంపట్నం, పిట్టలవానిపాలెం, కర్లపాలెం, బాపట్ల మండలాల్లో ప్రస్తుతం వేరుసెనగ నూర్పిళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం వ్యాపారులు రైతులకు 36.50 కేజీల బస్తాకు రూ.2200 చెల్లించి కొనుగోలు చేసి చీరాల, వేటపాలెం, చినగంజాం, ఒంగోలులోని మిల్లులకు తరలిస్తున్నారు. వ్యాపారులు మార్కెట్ సెస్‌ కింద ఒక శాతం, అమ్మకపు పన్ను కింద ఐదు శాతం చెల్లించాలి. మార్కెటింగ్‌ శాఖ చెక్‌పోస్టులు ఉన్నా గాని, కళ్లు గప్పి దొడ్డిదారిన వేరుసెనగ పంటను వాహనాల్లో ప్రకాశం జిల్లాకు తరలించి పన్ను ఎగ్గొడుతున్నారు. ఒక్క వేరుసెనగ ఒక్కటే కాదు.. ధాన్యం, మొక్కజొన్న, జొన్న, ఇతర పంట ఉత్పత్తులను ఎలాంటి పన్ను చెల్లించకుండా తరలిస్తున్నారు. స్థానికంగా బాపట్ల మార్కెట్యార్డుకు సెస్‌ కింద ఏటా రూ.3.20 కోట్ల ఆదాయం రావాలి. వాస్తవానికి 40 శాతానికి పైగా వ్యాపారులు పన్ను చెల్లించకుండా పంట ఉత్పత్తులు దారి మళ్లిస్తున్నారు. దీని ద్వారా ఏటా రూ.కోటిన్నర పైగా మార్కెటింగ్‌ శాఖ, రూ.5 కోట్లకు పైగా వాణిజ్యపన్నులశాఖ ఆదాయాన్ని కోల్పోతున్నాయి. నూరు శాతం పన్ను వసూలు చేస్తే లక్ష్యాన్ని మించి రూ.4.50 కోట్లకు పైగా ఆదాయం స్థానిక మార్కెట్యార్డుకు లభిస్తుంది.

క్వింటా వేరుశనగ ధర రూ.5275
మార్కెట్‌ సెస్‌ (ఒక శాతం) రూ.52
అమ్మకపు పన్ను(ఐదు శాతం)రూ.262

అక్రమ రవాణా ఇలా..
పిట్టలవానిపాలెంలో మార్కెటింగ్‌ శాఖ చెక్‌పోస్టును తప్పించుకుని వేరుశనగ బస్తాలతో ట్రాక్టర్లు, మినీ లారీలు, టాటా ఏస్‌ వాహనాలు బాపట్ల మండలం నందిరాజుతోట వద్ద పడమర పిన్నిబోయినవారిపాలెం వైపు వెళ్తున్నాయి. దీని ద్వారా మార్కెట్యార్డు ఎదురుగా ఉన్న చెక్‌పోస్టు, వెదుళ్లపల్లి చెక్‌పోస్టులో తనిఖీలు తప్పించుకుంటున్నారు. జీఎస్టీ అధికారుల కంటబడకుండా పడమర పిన్నిబోయినవారిపాలెం, గులాంహుస్సేన్‌తోట మీదుగా పట్టణంలోకి ప్రవేశించి విజయలక్ష్మీపురం, పాండురంగాపురం మార్గంలో అడవిపల్లెపాలెం మీదుగా ప్రకాశం జిల్లా ఓడరేవు వద్ద 216 జాతీయ రహదారికి చేరుకుంటున్నాయి. అక్కడి నుంచి వాహనాలు ప్రకాశం జిల్లాలోని మిల్లులకు వెళ్లిపోతున్నాయి. వాహనాలు వెళ్లే మార్గం ఇరుకు రోడ్డు కావడంతో ప్రమాదాలు చోటుచేసుకుని బోల్తా పడుతున్నాయి. గులాంహుస్సేన్‌ తోట సమీపంలో వేరుసెనగ కాయల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ ట్రక్కు బోల్తా పడి ఆ మార్గంలో వాహనాల రాకపోకలు గురువారం నిలిచిపోయాయి. ఆరా తీస్తే సరకు అక్రమంగా దొడ్డిదారిన తరలిస్తున్న విషయం బయటపడింది.

తనిఖీలు చేయకపోవడంతో..
అధికారులు ఈ మార్గంలో తనిఖీలు చేయకపోవడంతో అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. జీఎస్టీ, మార్కెటింగ్‌ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ మార్గంలో ఆకస్మిక తనిఖీలు చేస్తే అక్రమ రవాణాకు అడ్డుకట్టపడుతుంది. ఈ ప్రాంతంలో పండించిన ధాన్యాన్ని, మర ఆడించిన బియ్యాన్ని సైతం ఇదే విధంగా ఈ మార్గంలో వ్యాపారులు, కొందరు మిల్లర్లు అక్రమ రవాణా చేస్తూ పన్నులు ఎగ్గొట్టి ఏటా రూ.కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండీ కొడుతున్నారు. వేరుశనగ కాయల అక్రమ రవాణా ద్వారా రోజూ రూ.15 లక్షల ఆదాయాన్ని మార్కెటింగ్, జీఎస్టీ అధికారులు కోల్పోతున్నారు. అయితే మార్కెటింగ్‌ సిబ్బందికి అక్రమ రవాణా వ్యవహారం తెలిసినా చోద్యం చూస్తున్నారనే ఆరోపణలున్నాయి. వ్యాపారులు ముడుపులు ఇవ్వడంతో పన్ను వసూలు గురించి సిబ్బంది పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.

‘అక్రమ రవాణాను అడ్డుకుంటాం‘
మార్కెటింగ్‌ సెస్‌ చెల్లించకుండా కొందరు వ్యాపారులు దొంగ మార్గాల్లో అక్రమంగా వేరుసెనగ, ధాన్యం రవాణా చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చినట్లు బాపట్ల మార్కెట్‌యార్డు కార్యదర్శి మోహనరావు పేర్కొన్నారు. చెక్‌పోస్టులను తప్పించుకుని వేరే మార్గాల్లో పంట ఉత్పత్తులు తరలిస్తున్న వ్యాపారులపై ప్రత్యేక నిఘా పెడతాం. మొబైల్‌ వాహనాల ద్వారా తనిఖీలు చేసి సెస్‌ చెల్లించకుండా వెళ్తున్న వాహనాలు పట్టుకుని జరిమానా విధిస్తామన్నారు.

ఇదీ చదవండీ…'జగన్ అక్రమాస్తులపై పోరాడినందుకే కక్ష సాధిస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.