జాతీయ రహదారి నుంచి గుంటూరు నగరంలోకి ప్రవేశించే ప్రధాన రోడ్డు వాహనదారులను బెంబేలెత్తిస్తోంది. తెనాలి, పొన్నూరు, రేపల్లె, బాపట్ట, వేమూరు.. ఈ ఐదు నియోజకవర్గాల ప్రజలు ఈ రోడ్డు ద్వారానే రాకపోకలు సాగిస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యమున్న రోడ్డు గులకరాళ్లతో నిండిపోయింది. అభివృద్ధి పేరుతో పాత రోడ్డును తొలగించిన అధికారులు కొత్త రోడ్డును వేయకుండా అలాగే వదిలేశారు. గుంతలు, గులకరాళ్లు, రోడ్డు మధ్యలో స్తంభాలు, మ్యాన్‌హోల్స్, ఒకే వైపున రాకపోకలు ఇలా సమస్యలతో నిండి ఉంది ఆ రోడ్డు. పుష్కరాల సమయంలో రోడ్డును తవ్వి... మూడేళ్లుగా అలాగే వదిలేశారు. ఈ రోడ్డున రావాలంటే తీవ్ర ఇబ్బందులకు గురవతున్నామని.. వెంటనే కొత్త రోడ్డు వేయాలని వాహనదారులు కోరుతున్నారు.
పుష్కరాలకు తవ్వారు... ఇప్పటికీ అలానే వదిలేశారు
కళ్లలోకి దుమ్ము... కాళ్లలోకి రాళ్లు.... బండి నడపాలంటే గోతులు.... నడిచి వెళ్లాలంటే నానా అవస్థలు... ఇది గుంటూరు నగరంలోని ఓ రోడ్డు పరిస్థితి. జిల్లా కేంద్రం నుంచి ఐదు నియోజకవర్గాలకు వెళ్లే రహదారి గత నాలుగేళ్లుగా ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. గుంటూరు నుంచి తెనాలి వెళ్లే మార్గం దాదాపు 3 కిలోమీటర్ల మేర అధ్వాన్న స్థితిలో ఉన్న రోడ్డుపై ఈటీవి భారత్ స్పెషల్ ఫోకస్...