సమాజంపై దుష్ప్రభావం చూపే మాదకద్రవ్యాల నిర్మూలనకు రాష్ట్రంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని సెబ్ కమిషనర్ వినీత్ బ్రిజ్ లాల్ చెప్పారు. గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయంలో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్ స్టాన్సెస్ కేసులపై బ్రిజ్లాల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మాదకద్రవ్యాల నిరోధానికి దాడులు చేయటంతో పాటు.. ప్రజల్లో చైతన్యాన్ని నింపటం ముఖ్యమని ఆయన అన్నారు.
మత్తుకు అలవాటు పడి విద్యార్థులు.. తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ అన్నారు. కళాశాలల వారిగా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సెబ్ డైరెక్టర్ రామకృష్ణ, డీఐజీలు త్రివిక్రమ్ వర్మ, కె.మోహన్ రావు, గుంటూరు, కృష్ణా జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు.
ఇదీ చదవండీ.. తెలంగాణ: కొత్తగా 965 కరోనా కేసులు.. ఐదుగురు మృతి