Son killed His Mother In jangaon District: నవమాసాలు మోసి.. కని పెంచిన తల్లిని ఆస్తి కోసం అతి దారుణంగా హత్య చేశాడో కుమారుడు. తను అడిగిన భూమి ఇవ్వలేదన్న ఆగ్రహంతో కన్నతల్లిని కిరాతకంగా నరికేశాడు. తెలంగాణ రాష్ట్రం జనగామ మండలం మరిగడిలో గురువారం ఈ దారుణం చోటుచేసుకుంది. జనగామ సీఐ ఎల్లబోయిన శ్రీనివాస్ యాదవ్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మరిగడికి చెందిన కూరాకుల రమణమ్మ(65)కు కుమారుడు కన్నప్ప, కూతురు లావణ్య ఉన్నారు.
Son killed His Mother : పదేళ్ల కిందట రమణమ్మ భర్త రాజయ్య మృతి చెందారు. వివాహిత కుమార్తె భర్తతో విభేదాల కారణంగా తల్లి దగ్గరే ఉంటోంది. కన్నప్పకు కూడా వివాహమై.. భార్య, కుమార్తెతో జీవిస్తున్నాడు. రమణమ్మ పేరిట 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, కుమారుడికి 2, కుమార్తెకు 4 ఎకరాలు రాసిచ్చింది. మరో 2 ఎకరాలు కూడా తనకివ్వాలని కన్నప్ప పలుమార్లు కోరాడు. అయినా వినడం లేదన్న కోపంతో ఇటీవల తల్లి తలను గోడకేసి కొట్టాడు.
గాయపడిన ఆమె.. కుమారుడిపై కేసు పెట్టింది. దీంతో కన్నప్ప రెండు రోజుల కిందట ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. కుటుంబసభ్యులు అతడిని జనగామ ప్రభుత్వాసుపత్రిలో చేర్చగా, చికిత్స పొంది గురువారం ఉదయం ఇంటికి వచ్చాడు. రాగానే కత్తితో తల్లి మెడపై అతి కిరాతకంగా నరకడంతో ఆమె నేలకూలింది. తల, మొండెం వేరై.. రక్తం మడుగు కట్టింది. కన్నప్ప తల్లి తలను చేత పట్టుకొని కాసేపు పరిసరాల్లో తిరుగుతూ.. స్థానికులను భయాందోళనలకు గురిచేశాడు. తర్వాత జనగామ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.
ఇవీ చదవండి: