ETV Bharat / state

MURDER: ఆస్తి కోసం మామను హత్య చేసిన అల్లుడు

author img

By

Published : Jan 6, 2022, 10:05 AM IST

MURDER: భార్యభర్తల మధ్య గొడవల కారణంగా ఓ వ్యక్తి తన మామను కిరాతకంగా నరికి చంపిన ఘటన గుంటూరు జిల్లా చదవాడలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఆస్తి కోసం మామను హత్య చేసిన అల్లుడు
ఆస్తి కోసం మామను హత్య చేసిన అల్లుడు

MURDER: ఆస్తి కోసం అల్లుడే మామను అతికిరాతకంగా హత్య చేసిన ఘటన వేమూరు మండలం చదలవాడలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన బి.కృష్ణమూర్తి (80) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుంటారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అందరికీ వివాహాలు అయ్యాయి. మూడో కుమార్తె అమ్మికమ్మను ఏడేళ్ల క్రితం గుంటూరు గ్రామీణ మండలం పొత్తూరుకు చెందిన వి.సాంబశివరావుకి ఇచ్చి వివాహం చేశారు. అయితే సాంబశివరావు ఆస్తి తేవాలని తరచూ భార్య అమ్మికమ్మ, మామ కృష్ణమూర్తితో గొడవపడుతూ ఉండేవాడు.

ఈ క్రమంలో సాంబశివరావు మద్యం తాగి బుధవారం చదలవాడ వచ్చి మామ కృష్ణమూర్తితో గొడవపెట్టుకుని అతని గొంతుకోశాడు. దీంతో కృష్ణమూర్తి ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై అనీల్‌కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. పోలీసులు నిందితుడు సాంబశివరావును అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

ఇదీ చదవండి: tribals protest at paderu: పాడేరులో ఆదివాసీ గిరిజన సంఘం ఆందోళన..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.