Somu On Jagan Govt Over Schemes Names: కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు.. ముఖ్యమంత్రి జగన్ తన పేరు పెట్టుకోవటం ఏంటని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న 36 పథకాలకు కేంద్రం సాయం చేస్తోందన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సైతం ప్రధాని పేరు కాకుండా.. తన పేరు వేసుకుంటున్నారని వీర్రాజు ఆరోపించారు.
రాష్ట్రంలో పేదలకు 15 లక్షల ఇళ్లు కేటాయించామని.. వీటికి కూడా జగన్ తన పేరును తగిలించుకున్నారని ధ్వజమెత్తారు. ఇందుకుగానూ.. ఏపీ భాజపా తరపున సీఎం జగన్కు డబుల్ స్టిక్కర్, ట్రిపుల్ స్టిక్కర్ అని పేరు పెడుతున్నామని అన్నారు. గుంటూరులో రాజ్యాంగ ఆమోద ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ద్విచక్రవాహన ర్యాలీలో కన్నా లక్ష్మీనారాయణతో కలిసి సోము వీర్రాజు పాల్గొన్నారు.
ఇదీ చదవండి
BJP MP GVL On Jagan Govt: రెండున్నరేళ్లలో రూ.1.40 లక్షల కోట్ల అప్పు..దివాలా దిశగా రాష్ట్రం: జీవీఎల్