నాగులచవితి పర్వదినాన గుంటూరు జిల్లాలో ఆసక్తికర ఘటన జరిగింది. నాగు పాము కోడి గుడ్డుని ఆరగించగా... ఆ దృశ్యాలను భక్తులు చరవాణిలో బంధించారు. కొల్లూరు మండలం తూములూరులో నాగులచవితి సందర్భంగా భక్తులు పాము పుట్ట వద్ద పూజలు నిర్వహించారు.
పుట్టలో పాలు పోయటంతో పాటు కొందరు భక్తులు కోడిగుడ్లు కూడా వేశారు. భక్తుల సందడి కాస్త తగ్గాక బయటకు వచ్చిన పాము... గుడ్డును మింగేసింది. మొదట భయపడిన భక్తులు... ఆ తరువాత ఆసక్తిగా తిలకించారు. తమ కోర్కెలు తీరాలని వేడుకున్నారు.
ఇదీ చదవండి: