గుంటూరు జిల్లా నగరం గ్రామంలోని ఎస్టీ కాలనీలో సిలిండర్ పేలి 6 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు 15 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి.... క్రమేపి పక్కనే ఉన్న మరో 5 ఇళ్లకు వ్యాపించాయి. అందరూ కూలి పనులకు వెళ్లినందున గమనిచలేక పోయారు. సమచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. బాధితులకు తక్షణ సహాయంగా 5 వేల రూపాయల నగదు ..20 కేజీల బియ్యం,కందిపప్పు ,మంచినూనె అందిస్తున్నట్లు మండల ఎమ్మార్వో జి.శ్రీనివాసరావు తెలిపారు.
ఇదీ చదవండి