గుంటూరు జిల్లా బాపట్లలో శివ కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బాపట్ల - చీరాల రోడ్డు నుంచి టౌన్ హాల్ వరకు స్వామి వారి శోభాయాత్ర వైభవంగా జరిగింది. శ్రీశైల దేవస్థాన అర్చకుల ఆధ్వర్యంలో స్వామి వారి కల్యాణం జరిపారు. మహిళలంతా శివుని భక్తి గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు జయప్రకాష్ నారాయణ, బాపట్ల తెదేపా నేత వేగేశ్న నరేంద్రవర్మతో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. కల్యాణ వైభవానికి ములుకుట్ల బ్రహ్మానంద శాస్త్రి సోదరులు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.
ఇదీ చదవండి: