గుంటూరు జిల్లా మీదుగా నిర్మించనున్న 216 జాతీయ రహదారి బాపట్ల పట్టణంలో నుంచి వెళ్తోంది. రోడ్డు ఇరుకుగా ఉండటంతో ట్రాఫిక్ రద్దీ నెలకొంటోంది. బాపట్ల బైపాస్ నిర్మాణం పూర్తయితే మార్కెట్ యార్డు వద్ద పట్టణం బయట నుంచే వాహనాలు ఈ మార్గంలో పయనించి పేరలి కాల్వ వద్ద తిరిగి ప్రధాన రహదారిలో కలుస్తాయి. దశాబ్దాలుగా ఉన్న ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతుంది. కరోనా వల్ల పనులు నిలిచిపోవటం వల్ల ప్రాజెక్టు పూర్తి చేయటానికి గుత్తేదారుడికి అదనంగా ఆరు నెలల గడువును ఎన్‌హెచ్ అధికారులు ఇచ్చారు. రెవెన్యూ అధికారులు భూసేకరణ ప్రక్రియ పూర్తి చేస్తేనే పనులు వేగవంతం చేయడానికి అవకాశం ఉంటుంది.
రేపల్లె మండలం పెనుమూడి నుంచి బాపట్ల మండలం స్టూవర్టుపురం వరకూ రహదారి విస్తరణ పనులు చేపడుతున్నారు. ఈ పనుల ప్రాజెక్టు పూర్తికి గడువు.. 2020 డిసెంబరు. కాగా ప్రాజెక్టు వ్యయం రూ.487 కోట్లు. ఇక్కడ నిర్మాణ పనులు 2016 నవంబరు ప్రారంభించారు. పనులు చేస్తున్న దూరం 62.7 కి.మీ.
రెండు వారాల్లో భూములు అప్పగిస్తాం
“ జాతీయ రహదారి విస్తరణ పనులకు బాపట్ల మండలంలో సేకరించాల్సిన భూముల మార్కింగ్ పూర్తయింది. రైతులకు పరిహారం చెల్లించి రెండు వారాల్లో భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి ఎన్‌హెచ్ అధికారులకు భూములు అప్పగిస్తాం.” -శ్రీనివాస్, తహసీల్దారు
పనులు వేగంగా చేయించేలా కృషి
“ భూసేకరణ పూర్తి కాకపోవడంతో బాపట్ల బైపాస్ నిర్మాణ పనులు ప్రారంభించలేదు. రైతుల నుంచి భూమిని సేకరించి గుత్తేదారుడికి అందజేయగానే నిర్మాణ పనులు వేగంగా చేయిస్తాం. ప్రాజెక్టు పూర్తి చేయటానికి గుత్తేదారుడికి గడువును మరో పది నెలలు పొడిగించారు. వంతెనల నిర్మాణ పనులు త్వరితగతిన చేయిస్తాం.”
-పురుషోత్తం, ఎన్‌హెచ్ ఏఈ
ఇవీ చదవండి: భారీగా పోలీసుల మోహరింపు.. అడుగడుగునా తనిఖీలు