ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు.. వివిధ ఘటనల్లో మరో నలుగురు మృతి

author img

By

Published : Apr 3, 2023, 9:31 PM IST

Accidents in AP : నేడు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన వివిధ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ప్రకాశం జిల్లాలో కారు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లాలో ఈతకు వెళ్లన తండ్రి కొడుకుతో పాటుగా మరో వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లాలో విద్యుదఘాతంతో కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.

Etv Bharat
Etv Bharat

Accidents in Andhra Pradesh: ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం గొట్లగట్టు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి కారు చెట్టుకు ఢీకొన్న ప్రమాదం ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. గిద్దలూరు నుంచి ఒంగోలు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన ముగ్గురు ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు యూసుఫ్​లుగా గుర్తించారు. వీరంతా.. మెడికల్ రిప్రజెంటేటివ్స్ పని చేస్తున్నట్లు తెలిసింది.

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడ గ్రామ సమీపంలో వంశధార కాలువలో స్నానానికి దిగి ముగ్గురు మృతిచెందారు. ఆదివారం మధ్యాహ్నం వీరు స్నానానికి దిగి గల్లంతు అయ్యారు. నిమ్మాడ ఎస్సీ కాలనీకి చెందిన నాగరాజు (35), అతని కుమారుడు తులసిరాజు(9), మన్యం జిల్లా కు చెందిన వెంకటరమణ (39) మృతదేహాలను అర్ధరాత్రి దాటాక అగ్నిమాపక సిబ్బంది వెలికి తీశారు. నాగరాజు, వెంకటరమణ విజయనగరం జిల్లా రాజాం లోని జూట్ మిల్లు లో కార్మికులుగా పనిచేస్తున్నారు.

అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం శేషమాంబ పురం చెక్ పోస్ట్ వద్ద విద్యుత్ షాక్ తో ఓ కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందాడు. విద్యుత్ మరమ్మతుల కోసం కాంట్రాక్టు కార్మికుడు గంగయ్య(33) విద్యుత్ స్తంభం ఎక్కిన సమయంలో విద్యుత్ ప్రసరిస్తుండటంతో గంగయ్య స్తంభం ఫై నుంచి కింద పడిపోయాడు. గంగయ్యను హుటాహుటిన రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. చికిత్స తీసుకుంటూ గంగయ్య మృతి చెందాడు. అధికారుల నిర్లక్ష్యం వల్లే గంగయ్య మృతి చెందినట్లు కుటుంబసభ్యలు ఆరోపించారు. ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలో ఆర్సీఎల్ కంపెనీలో జరిగిన ప్రమాదం చోటుచేసుకుంది. ఆ ఘటనలో పూడిమడకకు చెందిన కొవిరి పెంటయ్య అనే కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందాడు. కంపెనీలో క్రేన్ ఢీకొని మృతి చెందినట్లు మృతుడి కుటుంబ సభ్యులు వెల్లడించారు. కంపెనీ వద్దకు చేరుకున్న మత్స్యకారులు, మృతుడు బంధువులు కంపెనీ గేట్‍ వద్ద ఆందోలనకు దిగారు.

కృష్ణా జిల్లా గంజాయి రవాణా చేస్తున్న ముఠాను కృష్ణా జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో గంజాయికి అలవాటు పడి బానిసలుగా మారి, అక్రమంగా గంజాయి అమ్మకాలు సాగిస్తున్న 22 మందిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ జాషువా తెలిపారు. వారి వద్ద నుంచి 40 కేజీల గంజాయి, మూడు గ్రాముల ఎండీఎం (మత్తుమందు), 16 సెల్ ఫోన్ లు, ఒక ఆటో, ఒక మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ గంజాయి కి అలవాటు పడిన వీరంతా ఉన్నత విద్యలు అభ్యాసిస్తున్నారని..., ఆధునిక టెక్నాలజీ ఉపయోగిస్తూ వివిధ ప్రాంతాలకు గంజాయిని సరఫరా చేస్తున్నారని చెప్పారు.

ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని ద్విచక్ర వాహనం దగ్ధ మైంది. పట్టణంలోని అటవీ శాఖ కార్యాలయం ఎదురుగా ఉన్న ఓ వెల్లింగ్ షాపులో ద్విచక్ర వాహనానికి వున్న సైడ్ స్టాండ్ వెల్డింగ్ చేస్తుండగా, ఒక్కసారిగా మంటలు ఎగసిపఢ్ఢాయి. స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక అధికారులు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.