ETV Bharat / state

నేడు హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం - home guards news

ఏరోజు పనిచేస్తే ఆరోజు మాత్రమే గౌరవ వేతనం... సెలవు పెడితే వేతనం ఉండదు... పోలీసులకు దీటుగా విధులు నిర్వహిస్తారు... వారే హోంగార్డ్సు.... వారి కృషికి తగిన ప్రతిఫలం పొందడం లేదు... నేడు హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వారి సేవలు, సమస్యలపై ఓ కథనం.

homeguards
విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్​ పోలీసులు
author img

By

Published : Dec 6, 2020, 11:55 AM IST

1946లో బ్రిటీష్‌ పాలన నుంచి దేశం విముక్తి పొందుతున్న క్రమంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి రక్షణ కల్పించడానికి కొంతమంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. శాంతిభద్రతలను అదుపు చేయడంతోపాటు అల్లర్లను అరికట్టడంలో ప్రజలకు సాయంగా ఉండాలనే ఉద్దేశంలో వివిధ రంగాల్లోని వారు సమూహంగా ఏర్పడి సేవలందించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ బృందాల సేవలను ప్రభుత్వం గుర్తించింది. చైనా యుద్ధం తర్వాత హోంగార్డులుగా గుర్తించి వారితో సేవ చేయించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలా 1963లో హోంగార్డ్సు వ్యవస్థ ఆవిర్భవించింది.

గుంటూరు అర్బన్‌ పరిధిలో 390, రూరల్‌ పరిధిలో 980 మంది విధులు హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారు. చోరీ కేసుల్లో నిందితులను పట్టుకోవడం, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ, శాంతిభద్రతల పరిరక్షణ, నేర రికార్డుల బ్యూరో, వేలిముద్రల విభాగం, విజిలెన్స్‌, కమ్యూనికేషన్‌, ఆక్టోపస్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌, సీబీసీఐడీ, మెరైన్‌, గ్రేహౌండ్స్‌, పోలీసు బ్యాండ్‌, పోలీసు శిక్షణ కేంద్రం, పోలీసు వాహన డ్రైవర్లు, వారెంట్లు జారీ, వీవీఐపీల బందోబస్తులు ఇలా అనేక విభాగాల్లో పోలీసులకు దీటుగా సేవలందిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఇతర విభాగాల్లోనూ విధులు నిర్వహిస్తున్నారు.

వేతనాలు ఇంతే...

హోంగార్డ్సుకు గతంలో రోజుకు రూ. 600 గౌరవ వేతనంగా అందించేవారు. ఆ మొత్తాన్ని రూ.700లకు పెంచారు. అలా నెలకు రూ.21 వేల వరకు వేతన రూపంలో అందిస్తున్నారు. అయితే పనిచేసిన రోజుకే వేతనం అందిస్తున్నారు. హోంగార్డ్సుగా సేవచేస్తున్న వారికి ప్రభుత్వం పోలీసు కానిస్టేబుళ్ల ఎంపికలో ప్రత్యేకంగా 10 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తుంది. పోలీసు నియామకంలో గరిష్టంగా 30 ఏళ్ల వరకు వయస్సు సడలింపు ఇస్తుంది. హోంగార్డ్సు ఫండ్‌ నుంచి చనిపోయిన హోంగార్డ్సుకు మట్టి ఖర్చుల కింద రూ. 5 వేలు అందిస్తోంది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న హోంగార్డ్సుకు వారి సంక్షేమ నిధి నుంచి రూ.4,999లు వరకు మంజూరు చేస్తుంది. కేంద్ర సంక్షేమ నిధుల నుంచి హోంగార్డ్సు కుమార్తె పెళ్లికి రూ.5 వేలు అందిస్తుంది. వారి విద్యార్థులకు మెరిట్‌ స్కాలర్‌షిప్‌గా రూ. 2 వేలు ఇస్తుంది. చనిపోయిన హోంగార్డ్సుకు ఆర్థికసాయంగా రూ. 15 వేలు వరకు మంజూరు చేస్తున్నారు. చనిపోయిన హోంగార్డులకు ప్రధానమంత్రి బీమా పథకం కింద రూ.2 లక్షలు వరకు అందజేస్తారు.

ఉద్యోగ భద్రత, పదోన్నతుల కోసం పోరాటం

కేంద్ర ప్రభుత్వం హోంగార్డులకు సర్వీసు కాలాన్ని బట్టి పదోన్నతులు కల్పించాలని పేర్కొనగా, కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తుంటే ఏపీలో అమలుకు నోచుకోవడం లేదని వాపోతున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేసినట్లుగా తమను పర్మినెంట్‌ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, శాశ్వత గృహాలు కల్పించాలని హోంగార్డ్సు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. కానిస్టేబుళ్లకు టీఏ, డీఏ, హెచ్‌ఆర్‌ఏ, గృహ రుణం, వాహన రుణం, జీపీఎఫ్‌, ఇంక్రిమెంట్లు ఇస్తున్నారని అవి ఏవీ హోంగార్డ్సుకు ఇవ్వకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. హోంగార్డ్సు చనిపోయిన, ఉద్యోగ విరమణ చేసినా ఎటువంటి నగదు ఇవ్వకపోవడం బాధాకరమని ఆవేదన చెందుతున్నారు. సహచర హోంగార్డ్సు అందరూ కలిసి తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా అందిస్తూ వారికి చేయూత ఇస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం హోంగార్డుల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.

ఉద్యోగ విరమణ చేసిన వారిని ఆదుకోవాలి

వేతనాల పెంపు, ప్రమాద బీమా కల్పనకు ధన్యవాదాలు. హోంగార్డులను పర్మినెంట్‌ చేసి ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు ఉద్యోగ విరమణ చేసేవారిని ఆర్థికంగా ఆదుకుంటే బాగుంటుంది.

-జె.ప్రభాకర్‌రావు, హోంగార్డ్సు అసోసియేషన్‌ అర్బన్‌ మాజీ అధ్యక్షులు

ఇదీ చదవండి: 'విద్యార్థులను అక్రమంగా తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.