గ్రామీణ ప్రాంతాల్లోని సెర్ప్, పట్టణాల్లోని మెప్మాల్లో డ్వాక్రా, పొదుపు సంఘాల్లో పనిచేసే రీసోర్సు పర్సన్లు, యానిమేటర్లకు గౌరవ వేతనాన్ని పదివేల రూపాయలకు పెంచుతూ మంత్రి మండలి నిర్ణయం తీసుకోవడంపై ఆ శాఖ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి వచ్చిన రీసోర్సు పర్సన్లు సమీపంలోని వైఎస్ విగ్రహానికి నివాళులు అర్పించి పాలాభిషేకం చేశారు. చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతోన్న తమను సీఎం జగన్ గుర్తించినందుకు చాలా సంతోషం వ్యక్తం చేశారు. వేతానాలు పెంచడంపై ధన్యావాదాలు తెలిపారు.
ఇదీ చదవండీ :