గుంటూరు జిల్లా తిమ్మాపురం నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న లారీని బుడంపాడు వద్ద పోలీసులు తనిఖీ చేశారు. అందులో 30 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నట్లు నల్లపాడు పోలీసులు గుర్తించారు. లారీ డ్రైవర్ నాగుల్ మీరా, క్లీనర్ షేక్ సైదా బియ్యం సరఫరా చేస్తున్న పావులూరి రామయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి రూ.20వేలు, రేషన్ బియ్యం, లారీని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: