ETV Bharat / state

పెత్తందార్లకే పెత్తనం అప్పగిస్తున్న జగన్‌ - అగ్రవర్ణాల కిందే ఎస్సీ నియోజకవర్గాలు

SC and BC Constituencies are Under Jagan Community: రాష్ట్రంలో జగన్‌ కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తలను మారిస్తే అందులో దళితులు, బీసీలే ఉన్నారు. నా ఎస్సీలు అంటూనే వారికి నాయకులుగా ఎదిగే అవకాశం లేకుండా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వైసీపీ నాయకులు గెలిచిన ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలన్నీ అగ్రవర్ణాల చేతుల్లోనే ఉండటం గమనార్హం.

sc_and_bc_constituencies
sc_and_bc_constituencies
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 13, 2023, 7:34 AM IST

పెద్దందార్లకే పెత్తనం అప్పగిస్తున్న జగన్‌- దళితులను ఎదగనివ్వకుండా అగ్రవర్ణాల కిందే ఎస్సీ నియోజకవర్గాలు

SC and BC Constituencies are Under Jagan Community: జగన్‌ ఇటీవల 11 నియోజకవర్గాల్లో తన పార్టీ సమన్వయకర్తలను మారిస్తే అందులో అయిదుగురు దళితులు, ముగ్గురు బీసీలున్నారు. వీళ్లే కాదు రాష్ట్రంలోని మొత్తం 29 ఎస్సీ నియోజకవర్గాల్లో సమన్వయకర్తల మార్పునకు వైఎస్సార్​సీపీ నాయకత్వం రంగం సిద్ధం చేసింది. బడుగు బలహీనవర్గాల ప్రజాప్రతినిధులు తమ సొంత నియోజకవర్గాల్లో నాయకులుగా ఎదిగే అవకాశం లేకుండా వారి కంటూ ఒక నియోజకవర్గం స్థిరంగా ఉండకుండా వైఎస్సార్​సీపీ అధిష్ఠానం పార్టీ సమన్వయకర్తలను మార్చేస్తుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. వాస్తవానికి దాదాపు వైఎస్సార్​సీపీ నాయకులు గెలిచిన ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలన్నీ ఇప్పటికే అగ్రవర్ణాల చేతుల్లోనే ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్న మార్పులూ వారిపై పెత్తనం చెలాయించేందుకేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నా ఎస్సీలు అంటూనే వారికి నాయకులుగా ఎదిగే అవకాశం లేకుండా చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

మంత్రి ఆదిమూలపు సురేష్‌ సొంత నియోజకవర్గం యర్రగొండపాలెం. కానీ 2014లో సంతనూతలపాడు నుంచి, 2019లో యర్రగొండపాలెం నుంచి ఆయన్ని వైఎస్సార్​సీపీ బరిలో దించింది. ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఆయన సొంత నియోజకవర్గంలో నిలదొక్కుకునేందుకు అవకాశం ఉంది. కానీ సురేష్‌ను తాజాగా కొండపికి మార్చారు. ఆపై జిల్లా దాటించేస్తారేమోనని సురేష్‌ వర్గం అసహనం వ్యక్తం చేస్తోంది. 2019లో సంతనూతలపాడు నుంచి గెలిచిన టీజేఆర్‌ సుధాకర్‌బాబు సొంత జిల్లా గుంటూరు కాగా ఆయన్ని ప్రస్తుతం పూర్తిగా పక్కన పెట్టేశారు. వీరిద్దరినీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలే వ్యతిరేకిస్తున్నారు.

వైసీపీలో చిచ్చు రేపిన ఇంఛార్జ్‌‌ల నియామకం - కొనసాగుతున్న రాజీనామాల పరంపర

Jagan community ruling in SC constituencies..

  • ఎస్సీ నియోజకవర్గాలు ఎస్సీల చేతుల్లో ఉండటం లేదు. అగ్రవర్ణాల నాయకులు పెత్తనం చెలాయిస్తున్నారు. రాయలసీమలో అయితే ఇక సీఎం సామాజికవర్గ నాయకులదే హవా. వారు చెప్పినవారికే సీటు. గెలిస్తే పెత్తందార్లు చెప్పినట్లుగా నడుచుకోవాలి.
  • ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలైన బద్వేలులో డీసీ గోవిందరెడ్డి, నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, కోడుమూరులో కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి, శింగనమలలో ప్రస్తుత ఎమ్మెల్యే భర్త సాంబశివారెడ్డి పెత్తనం సాగుతోంది.
  • సత్యవేడు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అదుపులో ఉన్నాయి.
  • ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం, సంతనూతలపాడు, కొండపి నియోజవర్గాల్లో మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పిందే వేదం అన్నట్లు పరిస్థితి ఉంది.
  • ఉత్తరాంధ్రలో ఎస్సీ నియోజకవర్గం అయిన రాజాం, ఎస్టీ నియోజకవర్గం అయిన పాలకొండలో శాసనమండలిలో ప్రభుత్వ విప్‌ అయిన పాలవలస విక్రాంత్‌ చేతిలో ఉన్నాయి.
  • గూడూరు నియోజకవర్గంలో పెత్తందార్లదే రాజ్యంగా మారిపోయింది. ఈ నియోజకవర్గంపై పేర్నాటి శ్యాంప్రసాద్‌ రెడ్డి, నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, కుమారస్వామి రెడ్డి, శివకుమార్‌ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి, ధనుంజయ రెడ్డిల ఆధిపత్యమే ఉంటోంది. ఇప్పుడున్న ఎమ్మెల్యే వరప్రసాద్‌ను ఈ సారి అక్కడ కొనసాగించే అవకాశం లేదంటున్నారు.

వైసీపీ బస్సు యాత్రకు వచ్చారు - మధ్యలోనే మద్యం దుకాణానికి పరుగులు తీశారు

ఎన్నికల్లో స్థానచలనం ఎస్సీలకే.. ప్రస్తుతానికి ఎస్సీ మంత్రులైన సురేష్, మేరుగు నాగార్జునను వేరే నియోజకవర్గాలకు మార్చారు. మిగిలిన మంత్రులనూ మార్చుతారన్న ప్రచారం వినిపిస్తోంది. గంగాధర నెల్లూరు నుంచి గెలిచిన ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిని మార్చాలని స్థానికంగా ఉన్న వైఎస్సార్​సీపీలోని ప్రధాన సామాజికవర్గ నేతలు ఒత్తిడి పెంచుతున్నారు. నారాయణస్వామిని వ్యతిరేకిస్తున్న ముఖ్యనేత ఒకరు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సన్నిహితుడే. హోంమంత్రి తానేటి వనితను గోపాలపురానికి మారుస్తారనే ప్రచారం ఉంది. మరో మంత్రి పినిపె విశ్వరూప్‌ను ఎంపీగా పంపే అవకాశం ఉందంటున్నారు. ప్రతి ఎన్నికల్లో స్థానచలనం ఎస్సీలకేనా అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సర్వేలన్నీ ఎస్సీ, బీసీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనే వ్యతిరేకత ఉన్నట్లు చెబుతున్నాయా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి లాంటి నేతల నియోజకవర్గాల్లో అంతా బాగుందని చెబుతున్నాయా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

పొమ్మనలేక పొగబెట్టడమేనా.. హోంమంత్రిగా చేసిన మేకతోటి సుచరితను ఆమె సొంత నియోజకవర్గం ప్రత్తిపాడు నుంచి అమరావతి రాజధాని పరిధిలోని తాడికొండకు మార్చారు. రాజధానిలో వైఎస్సార్​సీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్నా ఆమెను అక్కడకు పంపడమేంటే పొమ్మనలేక పొగబెట్టడమేనా అనే చర్చ వైఎస్సార్​సీపీ వర్గాల్లో జరుగుతోంది. ఇదే తాడికొండలో 2014లో వైఎస్సార్​సీపీ అభ్యర్థిగా కత్తెర క్రిస్టినా పోటీచేసి ఓడిపోయారు. అయినా పార్టీ కోసం పనిచేసినా పట్టించుకోకుండా 2019లో ఉండవల్లి శ్రీదేవికి టికెట్‌ ఇచ్చారు. తర్వాత ఆమె పార్టీకి దూరమవడంతో మళ్లీ క్రిస్టినా కుటుంబాన్ని తెరపైకి తెచ్చారు. క్రిస్టినా భర్త సురేష్‌ నియోజకవర్గమంతా పార్టీ కార్యక్రమాలు చేపడుతూ కష్టపడుతున్న సమయంలో ఇప్పుడు వారిని పక్కన పెట్టేసి సుచరితను తీసుకురావడం ఏంటన్న వాదన వైఎస్సార్​సీపీలో వ్యక్తమవుతోంది.

అంతన్నాడు, ఇంతన్నాడు - తీరా చూస్తే నమ్ముకున్నోళ్లను నట్టేట ముంచుతున్నాడు

Changed BC leaders in constituencies..

  • బీసీ వర్గానికి చెందిన మహిళా మంత్రి విడదల రజిని చిలకలూరిపేట నియోజకవర్గంలో నిలదొక్కుకుంటున్న వేళ ఆమెను అక్కడనుంచి గుంటూరు పశ్చిమకు మార్చారు.
  • గాజువాకలో పవన్‌కల్యాణ్‌ను ఓడించిన తిప్పల నాగిరెడ్డి ఈసారి తన కుమారుడు దేవన్‌రెడ్డిని తీసుకొద్దామనుకున్నారు. ఆయననూ పక్కన పెట్టేయడంతో పార్టీకి దూరమయ్యే పరిస్థితి వచ్చింది.
  • జగన్‌కు మొదట్నుంచి అండగా ఉంటూ చివరికి అక్రమాస్తుల కేసులోనూ ఇరుక్కున్న ఎంపీ మోపిదేవి వెంకటరమణ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న రేపల్లెలోనూ ఆయన్ని కాదని మార్చారు.
  • ‘డోన్‌లో మంత్రి బుగ్గనపై వ్యతిరేకత ఉన్నట్లు సర్వేలన్నింటిలో వస్తున్నా ఆయన్ను అక్కడే కొనసాగిస్తున్నారు. రేపల్లెలో మోపిదేవిని మాత్రం పక్కనపెట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.